Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
Telangana Ration Cards Apply In Mee Seva: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ వేదికగా మీ సేవల్లో రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కీలకమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బిర్యానీ, మటన్ కర్రీ, ఓ స్వీట్ తిని వచ్చాం అంతే' అంటూ ఎద్దేవా చేశారు. సీఎల్పీ సమావేశం వలన ఒరిగేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Congress MLA Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటుకు సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ సమావేశాన్ని తీసి పడేశారు. 'మటన్ బిర్యానీ తిని వచ్చాం' అంటూ ఎద్దేవా చేశారు.
Telangana BJP: ఆ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి చిచ్చురేపిందా..! అసలే అంతంత మాత్రంగా ఉన్న క్యాడర్ జిల్లా అధ్యక్ష పదవిని ప్రకటించడంతో వర్గాలుగా విడిపోయారా..! నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తికి పగ్గాలు అప్పజెప్పితే మేం పార్టీలో పనిచేయలేమంటూ ఏకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారా..! 30 ఏళ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఆ వ్యక్తికే మళ్లీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారా..! ఇప్పటికే సంవత్సర కాలం అధ్యక్షుడిగా పనిచేసిన అ నేత తీరు పార్టీకే నష్టం కలిగించిందంటూ రాష్ట్ర నాయకత్వానికి విన్నవించినా పార్టీ నియమ నిబంధనలు కాదని జిల్లా అధ్యక్ష
Congress Vs BJP: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్- బీజేపీలు కలిసిపోయాయా..! బీజేపీ ఎంపీతో చేతిలో చెయ్యేసి కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారా..! రెండు పార్టీల నేతల తీరుతో కిందిస్థాయి క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా..! ఇంతకీ పాలమూరు జిల్లా లీడర్లు రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారా..!
Sandra Venkata Veerayya Vs Matta Raghmai In Sattupalli: ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఆ నియోజకవర్గంలో ఇంకా రాజకీయం ఉడుకుతోంది. ప్రత్యర్థులు అటుఇటు అయినా.. బలబలాలు మారినా అక్కడ అట్టుడుకుతోంది. నువ్వానేనా అనే రీతిలో సాగుతున్న రాజకీయం తెలుసుకుందాం.
Two MLAs Ready To Rejoins Into BRS Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయినా ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డారా..! తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారా..! అందుకే తమ ఇళ్లలో కేసీఆర్ ఫొటోను తీసేందుకు నిరాక తీసేయలేదని చెబుతున్నారా..! కారెక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యేల దారెటు!
School Holidays Two days: విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్. ఫిబ్రవరి 14వ తేదీ 'షబ్ ఏ బరాత్' సందర్భంగా కొన్ని మైనారిటీ స్కూళ్లకు సెలవు వచ్చింది. దీంతోపాటు ఈనెల 26, 27 రెండు రోజులు వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jagadish Reddy Demands Revanth Reddy And Congress Party Apology: పాలన చేతకాక అస్తవ్యస్తంగా చేస్తుండడంతో ప్రజల్లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
KA Paul Fire On Narendra Modi A Head Of Indian Migrants Deportation: అక్రమ వలసదారులను పంపిస్తుండడంతో భారతదేశంలో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేశారు.
T Congress: కులగణన విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు ఇదంత తప్పుల తడక సర్వే అంటూ సొంత పార్టీ పైనే విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం భేటి కానుంది.
Teenmar Mallanna: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన తాజాగా చేసిన కులగణనపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు తెలంగాణలో అగ్ర కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అటు తెలంగాణ మంత్రి సీతక్క మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Folk Artists Celebrates Bonalu At Baddi Pochamma Temple: వేములవాడలోని బద్ది పోచమ్మ అమ్మవారికి తెలంగాణ జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ప్రతియేటా గూగుల్ అమ్మ, యూట్యూబ్ తల్లి పేరిట బోనాలు ఇవ్వడం సంప్రదాయంగా మార్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి పొందుతున్న కళాకారులు కృతజ్ఞతగా ఈ సంబరాలు చేసుకున్నారు.
Artists Celebrates Google YouTube Bonalu: తమకు జీవనోపాధి కల్పిస్తున్న గూగుల్, యూట్యూబ్‌లకు కృతజ్ఞతలుగా కళాకారులు బోనాలు సమర్పించారు. గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు అంటూ వేములవాడలోని బద్ది పోచమ్మకు కళాకారులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Telangana Weather Update: మొన్నటి వరకు చలి చంపేసింది. ఇక ఎండాకాలం వంతు. నేటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.