Telangana Congress: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలతో పాటు బీజేపీ చేసిన మిస్టేక్స్ కాంగ్రెస్ కు అయాచిత వరంగా మారాయి. దాన్ని రేవంత్ సరైన క్రమంలో పెట్టి ప్రజల్లో వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడి యేడాది గడవక ముందే అపుడే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలనే ముసలం పుట్టింది.
Union Budget 2025 Telangana Allotments List Here: దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసలు తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఏమిటో తెలుసుకుందాం..
Bandi Sanjay: కేంద్ర బడ్జెట్‌పై బండి సంజయ్ స్పందించారు. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అన్నారు. ఒక్కొ ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గుతున్నాయన్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ సీఎంగా కొంత మంది గుర్తించడం లేదనే విషయం జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
KCR Words Gives Tension On Employees Salaries Payment" రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాజీ సీఎం కేసీఆర్ అక్షరరూపం ఇచ్చారని.. 'జీతాలు చెల్లించలేని పరిస్థితి' ఏర్పడుతుందని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. డీఏలు, పీఆర్సీ అమలుపై ఆందోళన రేకెత్తుతోంది.
Revanth Reddy - Vem Narender Reddy: సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్‌కు త్వరలో బంపర్ ఆఫర్ తగలబోతుందా..? ప్రభుత్వంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆ షాడో లీడర్ కు మరింత ఉన్నత పదవి ఖాయమైందా..? తన ఆప్తుడికి ఎలాగైనా ఆ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా..? అధిష్టానంతో ఈ విషయంపై సీఎం ఇప్పటికే చర్చలు జరిపారా..? రేవంత్ రెడ్డి అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి చివరలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఆ కీ లీడర్ కు ప్రమోషన్ దక్కనుందా..?
KCR Speech: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో కలకలం రేపింది.
Ex CM KCR Reentry: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వైఫల్య పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.
BRS MLAs Defected To Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత అని అడిగింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Harish Rao on Hyderabad Real Estate: గత 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఫ్లాట్లు అమ్ముడుపోలేదని బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
Revanth Reddy big Shock: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లకు ఇక్కడ ప్రజలు కృతజ్ఞతతో అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అనే కంటే బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ కు అధికారం ప్రజలు కట్టబెట్టేలా చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి తాజాగా ఓ సర్వే కలవరపెడుతోంది.
Liquor Prise hike: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త. మద్యం ధరల పెంపుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
Employees Retirement Age Increased From 60 To 65 Hero GO: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఊహించినట్టుగానే పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రస్తుతానికి ప్రొఫెసర్లకు తీసుకోగా.. త్వరలోనే మిగతా వారికి తీసుకునే అవకాశం ఉంది.
Vasant Panchami: ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 అనగా..ఈ రాబోయే సోమవారం తెలంగాణ ప్రభుత్వం.. అన్ని పాఠశాలలకు ఆప్షనల్ సెలవు ప్రకటించింది. అందుకు ముఖ్య కారణం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రావడం. హిందువులు ఎంతో ప్రాముఖ్యంగా జరుపుకునే ఈరోజున ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నరిచే అన్ని పాఠశాలలకు సెలవు వుండనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Telangana Ministry Expansion Exclusive Story: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది. ఇంతలా డీలా పడడానికి ప్రధాన కారణాలేంటీ.. అసలు క్లారిటీ ఇక్కడ తెలుసుకోండి.
Lady Aghori: లేడీ అఘోరి మరోసారి తెలంగాణలో హల్ చల్ చేసింది. ఎన్టీపీసీ కి సమీపంలోని మల్కాపర్ గ్రామంలో ఓ భక్తురాలి ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలో తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు.
AI Technology In Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో విస్తృతంగా లబ్ది పొందే విధానాన్ని గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న అధికారులతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఇలా చేయడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదన్నారు.
Water Disruptiuon in Hyderabad: 132 కేవీ నర్సపల్లి ఫీడర్ సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇది కాకుండా ట్రాన్స్‌కో అధికారులు కూడా మరమ్మతులను ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా ఏ రోజుల్లో అంతరాయం కలుగుతుందో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.