IPS Officers Relieve: తమ సొంత కేడర్ రాష్ట్రానికి కాకుండా తెలంగాణలో ఉంటున్న కేంద్ర సర్వీస్ అధికారులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా.. తాజాగా ఐపీఎస్ అధికారులకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఉంటున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులు వెంటనే రిలీవ్ కావాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అనంతరం తమ సొంత కేడర్ రాష్ట్రంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Old Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. పాత పింఛన్ అమలు ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి తెలంగాణలో కొనసాగుతున్నారు. నాటి సీఎం కేసీఆర్ పాలనలో అంజనీకుమార్ ఏకంగా డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం డీజీగా కొనసాగుతున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా అభిషేక్ మహంతి విధులు నిర్వహిస్తు్నారు. వీరు ముగ్గురు సొంత రాష్ట్రానికి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
Also Read: Boycott OYO: మరో వివాదంలో 'ఓయో రూమ్స్'.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ ఓయో'
ఈ ముగ్గురు పోలీస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ పోలీస్ అధికారులు తమ సొంత రాష్ట్ర కేడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఈ ముగ్గురు పోలీస్ అధికారులు రెండు, మూడు రోజుల్లో తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు. గతంలో ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా ఇదే జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొనసాగుతున్న ఆమ్రపాలితోపాటు మరికొంత మంది ఐఏఎస్ అధికారులు తెలంగాణలో కొనసాగుతుండగా.. వారిని కేంద్ర ప్రభుత్వం ఏపీకి పంపించింది. ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఇష్టపడడం లేదు. తెలంగాణలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.