8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
8th Pay Commission Update: తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత రూ. 75 వేల వరకు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ ఉద్యోగులు ఈ బడ్జెట్ లో వారికి భారీ ఊరట లభించింది.
జీతం పెంపు గణన: ఈ లెక్కలు గత 7వ పే కమిషన్ అంచనా వేసిన ఫిట్‌మెంట్ పై ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రకటించిన వేతన సవరణతో ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగబోతున్నట్టు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
జీతాల పెంపు లెక్కింపు: 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయబడిన తర్వాతే ఎంత జీతం పెరుగుతుందనే దానిపై క్లారిటీ వస్తోంది. మొత్తంగా ఉద్యోగుల మనస్సుల్లోని ఈ ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ లభిస్తోంది. ఎంత జీతం పెరుగుతుందనే దానిపై ఖచ్చితమైన లెక్కలు మాత్రం లేవు కానీ కొన్ని లెక్కల ఆధారంగా కొన్ని అంచనాలు వేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించి దాదాపు నెల రోజులు పూర్తి కావొస్తోంది. అయితే, కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని గతంలో ఉన్న బేసిక్ శాలరీ జీతంతో గుణించి కొత్త మూల వేతనం లెక్కించబడుతుంది.
7వ పే కమిషన్..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీని వలన ఉద్యోగుల మొత్తం జీతం దాదాపు 23-25% పెరిగింది. 8వ వేతన సంఘం ఆధారంగా ఫిట్ మెంట్ 2.28 నుంచి 2.86 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
8వ వేతన సంఘం సిఫార్సులలో 2.86 ఫిట్‌మెంట్ ప్రకారం జీతాలు చెల్లిస్తే.. మినిమం బేసిక్ శాలరీ రూ. 18,000 నుండి రూ. 51,480కి పెరుగుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.28గా నిర్ణయించినట్లయితే, మినిమం టూ మినిమం రూ. 41,040 జీతం ఉంటుంది.
బేసిక్ శాలరీతో పాటు మొత్తం వేతనంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ప్రయాణ భత్యం (TA) వంటి అనేక అలవెన్సులు కూడా ఉన్నాయి. ఈ భత్యాల పెరుగుదల బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కించబడుతుంది. అందువల్ల 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం సుమారు 25-30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
1 జనవరి , 2016 నుండి అమల్లోకి వచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు 2.57 ఫిట్‌మెంట్ ఆధారంగా జీతాలు పెంచారు. ఫలితంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.7,000 నుండి రూ.18,000కి పెరిగింది. దీనికి ముందు, 6వ వేతన సంఘం (2006 నుండి 2016 వరకు అమల్లో ఉన్నసమయంలో ఫిట్‌మెంట్ 1.86గా ఉండేది.