Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజు వేడుకలను విమానంలో జరుపుకున్నారు. చిరు కుటుంబంతో పాటు, నాగార్జున ఫ్యామిలీ, నమ్రత కూడా అక్కడే ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సతీమనితో కలిసి దుబాయ్ కు స్పెషల్ ఫైట్ లో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ లను తన ఆప్తమిత్రుడు నాగార్జున , అమలతో కలిసి జరుపుకున్నారు.
అయితే.. అదే విమానంలో మహేబ్ బాబు సతీమణి నమ్రత కూడా ఉన్నారు. అనుకొకుండా.. వీరంతా ఒకే విమానంలో కలిసి నట్లు సమాచారం. ఈ క్రమంలో చిరు దంపతులకు అక్కినేని నాగార్జున, అమల ప్రత్యేకంగా పూలగుచ్ఛం ఇచ్చి విషేస్ చెప్పారు.
వీరితో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈవేడుకల్లో తనదైన స్టైల్లో పాల్గొన్నారు. చిరు దంపతులకు స్పెషల్ వెడ్డింగ్ డే విషేస్ చెప్పారు. అయితే.. సురేఖ తన జీవితంలో రావడం తన లక్ అని చిరు చెప్పుకొచ్చారు.
తన బెస్ట్ సోల్ మెట్ అని.. ప్రతి విషయంలో తనను ముందుండి నడిపిస్తుందన్నారు. చాలా విషయాల్ని తన నుంచి నేర్చుకుంటారని చెప్తు చిరంజీవి తమ వైవాహిక బంధం గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా.. ఇన్ స్టాలో ఎమోషన్ పోస్ట్ పెట్టారు.
అయితే.. చిరంజీవి వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ లో కేవలం నమ్రత మాత్రమే ఉన్నారు. మహేష్ బాబు కన్పించడంలేదు .అయితే... గతంలో జక్కన.. మహేష్ బాబుతో కలిసి.. SSMB 29 ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అప్పుడు రాజమౌళీ సరదాగా.. సింహాన్ని జైలులో బంధిస్తున్నట్లు ఫన్నీ పోస్ట్ పెట్టారు.
దీన్ని బట్టి చూస్తే జక్కన్న మూవీస్ అంటే రెండు, మూడేళ్లు ఆయనకు అంకితం ఇవ్వాలి. పర్సనల్ లైఫ్ మిస్ చేసుకున్నట్లే.. ఇక పోతే మహేష్ బాబు ఏమాత్రం గ్యాప్ దొరికిన భార్య పిల్లలతొ కలసి రెగ్యులర్ గా ఏదో ఒక ట్రిప్ లకు వెళ్లిపోతుంటారు. దీన్ని బట్టి చూస్తే జక్కన్న నిజంగానే.. మహేష్ బాబు పాస్ పొర్ట్ ను తన దగ్గరే పెట్టుకున్నారా.. ఏంటీ.. అందుకే నమ్రత ఒక్కరే ఏటో వెళ్తున్నారు.. అని నెటిజన్లు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. పాపం.. నమ్రతకు ఎంత పెద్ద కష్టం అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు భలే బుక్కై పోయావ్ గా.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.