Koneru Konappa Resign: తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా విఫలమవడం.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. స్థానిక ఎన్నికల ముందు పార్టీని వీడడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ కాగజ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరి ఏడాది కూడా ఇమడలేకపోయారు. రేవంత్ రెడ్డి వ్యవహార ధోరణితోపాటు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో అభివృద్ధి పనులు ప్రభుత్వం చేయకపోవడంతో కోనప్ప అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఫ్లైఓవర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డిపై కోనప్ప తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కోనప్ప తాజాగా రాజీనామా చేశారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం?
రాజీనామా అనంతరం కోనప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని విమర్శించారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్‌ను రద్దు చేయడం దారుణంగా అభివర్ణించారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. స్వతంత్రంగా ఉంటానని కోనప్ప ప్రకటించారు.
2024 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. 2023 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేయగా.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల సమయంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అసంతృప్తితో గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్‌కు బై బై చెప్పేయడంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోగా.. తాజాగా కోనప్ప రాజీనామాతో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.