Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Budget 2025: 2025 బడ్జెట్లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.
Best Recharge Plan: ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచడంతో పెద్దఎత్తున యూజర్లు బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారు. ఈ క్రమంలో యూజర్లను ఆకర్షించేందుకు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. నేడు యావత్ దేశం దృష్టి ఆమెపైనే ఉంటుంది. ఫిబ్రవరి 1న, సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈరోజు వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. సరళతను ఇష్టపడే నిర్మలా సీతారామన్ గురించి బడ్జెట్ చర్చల మధ్య, ఈ రోజు ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Reliance Jio Reintroduced Plan: జియో ఇటీవలె ట్రయ్ ఆదేశాల మేరకు వాయిస్ ప్లాన్స్‌పై ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రైవేట్ దిగ్గజ టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే వాయిస్ ప్లాన్స్ అందిస్తుంది. తాజాగా మరో ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.189 తో అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rates Today: బంగారం ధర భగ్గమంటోంది.రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పసిడి శనివారం మరో ఉన్నత శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
CRPF Assistant Commandant Poonam Gupta Marriage: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ లో పీఎస్ఓగా సేవలందిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి అత్యున్నత స్థాయి భవనం వేదికగా నిలవబోతోంది. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహ వేడుకను నిర్వహించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి మంజూరు చేశారు.
Pm Modi On Budget 2025: బడ్జెట్ 2025 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేయవచ్చని సూచించారు. మధ్యతరగతి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపుతో ఇది ముడిపడి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వార్షిక పద్దుపై మరింత అంచనాలు పెంచుతున్నాయి.
Gold Rates Rise: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024న బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత బంగారం దిగుమతులు ఊపందుకున్నాయి. అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. భారతదేశం తన బంగారం అవసరాలను చాలా వరకు దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బంగారం దిగుమతులు పెరిగే కొద్దీ భారతదేశ వాణిజ్య లోటు పెరుగుతుంది.
Economic Survey: పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పించడానికి ముందు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు.
Central Govt on Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసింది. లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరని.. ఫాస్టాగ్‌కు కూడా ఇన్సురెన్స్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చనేసింది. అదేవిధంగా ఇన్సురెన్స్ లేకుండా వాహనం నడిపితే.. కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
Jio Recharge Limited offer: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల అద్భుతమైన రీఛార్జి ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ముగిసేందుకు మరో రోజే మిగిలింది. ఆ తరువాత ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఈ ప్లాన్ కావల్సినవారు వెంటనే రీఛార్జి చేయించుకోవచ్చు.
Union Budget 2025 Housing: ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్ పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందినవారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈసారి బడ్జెట్లో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దెత్తున వరాలను ఆశిస్తున్నారు. ఈ రంగం పుంచుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించడంతోపాటు వ్యవస్థలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది.
Budget 2025-26: వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ లో పతనమవుతున్న ఆర్థక వృద్ధి రేటు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్ లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిలోపాటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో నిర్మలమ్మ ముందున్న సవాళ్లే ఏంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.