Infosys సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?
Price rise news: కొత్త సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి మన్నికగల వినియోగ వస్తువుల ధరలు పెరిగాయి. మార్చి నాటికి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.
Excise Collection Surges: పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.1.71 కోట్లు ప్రభుత్వ నిధికి జమ అయ్యాయి. కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే ఇది 79 శాతం వృద్ధి చెందడం విశేషం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్ - సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
Petrol Price: దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.
Mahindra XUV700: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 కారుకు మంచి క్రేజ్ లభిస్తోంది. కేవలం 57 నిమిషాల్లోనే 25 వేల ఆర్డర్లు అందుకున్న తొలి కార్ మోడల్‌గా ఎక్స్‌యూవీ 700 ఘనత సాధించింది.
ఎలక్ట్రిక్ వాహనదారులకు 'అథర్ ఎనర్జీ' గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత ఛార్జింగ్ సర్వీసును పొడిగిస్తున్నట్లు అథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా ప్రకటించారు.
Xiaomi Smart Glasses: టెక్ యుగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో ఆవిష్కరణ చేస్తూ..మనిషి తన జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. తాజాగా మార్కెట్లోకి మరో గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది.
SBI Alert to Customers: మీరు ఎప్పుడైనా సరే అపరిచిత వ్యక్తులు మీకు సూచించే యాప్‌లను untrustworthy source నుంచి మాత్రం డౌన్లోడ్ చేయకూడదు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలని సూచించింది.
LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది.
Google Photos Fee Storage: ఎప్పటికప్పుడూ మార్పులు గమనిస్తున్న నెటిజన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు ప్రత్యామ్నాయాన్ని సైతం తెలుసుకుని సమస్యల బారిన పడకుండా నడుచుకుంటున్నారు. డేటా స్టోరేజ్ పరిమితి మించితే జూన్ 1 నుంచి నగదు చెల్లించాల్సి ఉంటుంది.
Jio Offers Unlimited Internet: రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.
Samsung Galaxy F12 Price In India: బడ్జెట్ ధరలలో ఓ మొబైల్‌ను రెండు వేరియంట్లలో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారత్ మార్కెట్లోకి శాంసంగ్ F02s అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ సైతం ప్రకటన విడుదల చేసింది.
SBI Customers Alert | అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. నేడు స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కొంత సమయం సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
BSNL Latest News | టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందిన బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సేవల్ని తమ వినియోగదారులకు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వినియోగదారులకు శుభవార్త అందించింది.
Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్ఫోన్లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.