PF Withdrawal with UPI: పీఎఫ్ కస్టమర్ల ప్రయోజనం, సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తుంటుంది. రిటైర్మెంట్ అనంతరం ఆర్ధిక రక్షణ అందించే పీఎఫ్ ఎక్కౌంట్‌లో అవసరమైనప్పుడు అంటే అత్యవసర సమయంలో కొద్ది మొత్తం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ అందించింది.
పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే విత్ డ్రా చేసుకునేందుకు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి వారం పది రోజులు సమయం పడుతుంది. అయితే త్వరలో పీఎఫ్ డబ్బుల్ని ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ప్రవేశపెట్టనున్నట్టు ఈపీఎఫ్ఓ ఇటీవలే ప్రకటించింది. అంటే మీరు మీ డెబిట్ కార్డు నుంచి ఏ విధంగా డబ్బులు విత్‌డ్రా చేసుకుంటారో అదే విధంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. పీఎఫ్ డబ్బుల్ని మరో విధానంలో కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది అమల్లోకి వస్తే పీఎఫ్ కస్టమర్లకు చాలా ప్రయోజనం కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 7.4 మిలియన్ల ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.
పీఎఫ్ కస్టమర్లు త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బుల్ని పొందే సరికొత్త సదుపాయం రానుంది. ఈపీఎఫ్ఓ ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ ద్వారా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కావల్సిన మొత్తం డబ్బుల్ని క్షణాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతోంది. అంటే మీ యూపీఐకు ఈపీఎఫ్ఓ ఖాతా లింక్ అవుతుంది. దీనివల్ల పీఎఫ్ నగదు క్లెయిమ్ ప్రోసెసింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది.
మరో మూడు నెలల్లో యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే పద్థతి ప్రారంభం కావచ్చని అంచనా ఉంది. అదే జరిగితే డిజిటల్ వ్యాలెట్ ద్వారా డబ్బుల్ని సులభంగా పొందవచ్చు. ఇందులో భాగంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ వ్యవస్థ అప్‌గ్రేడ్ కానుంది.
Also read: Pan 2.0: పాన్ 2.0 తీసుకున్నారా, ఉచితంగా ఎలా అప్లై చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి