ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలలో దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ భారత్‌లో అత్యుత్తమ సీఎంలలో నాలుగో స్థానం దక్కింది. కరోనా వైరస్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వైఎస్ జగన్.
జేసీ దివాకర్ రెడ్డికి ( JC Diwakar Reddy ) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇదివరకే ఏపీ రవాణా శాఖ అధికారులు జరిపిన దాడుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిలకు ( JC Prabhakar Reddy ) చెందిన దివాకర్ ట్రావెల్స్ ( Diwakar Travels ) బస్సులలో అనుమతి లేకుండా నడుస్తూ పట్టుబడిన వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (YS Jagan) ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ( Amit Shah ) పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ( Gajendra Singh Shekhawat ) సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్‌కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, హోదా ఇస్తే రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏడాది పాలన తర్వాత సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
YS Jagan | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఓ వైపు లాక్డౌన్ సమస్యలతో సమమతమవుతున్న మత్స్యకారులు ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నారు
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన నేరం కింద టీడీపీ నేతలు ఇలా కేసులో ఇరుక్కోవడం ఇటీవల ఇది రెండోసారి. ఇదివరకే లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారని టీడీపీ ఎంపీ కేశినేని నానిపై క్రిష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రెడ్‌జోన్, కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్నవారిలో ఎవరికైనా శ్వాస అందక ఇబ్బుందులు పడినా, లేదా ఫ్లూ లాంటి కరోనా లక్షణాలు కనిపించినా తక్షణమే 104కు ఫోన్ చేయాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.