Ysrcp leader caught by police prostitution in Vijayawada: ఏపీలో రాజకీయాల్లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సీక్రెట్ గా ఒక ఇంట్లో వ్యభిచారం చేస్తు వైసీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులకు ముందస్తు సమాచారం మేరకు సదరు ఇంటిపై దాడి చేశారు.
ఈ క్రమంలో వైసీపీ నేత మంచంపై మత్తులో పడుకుని ఉన్నాడు. ఆ గదిలో మరో యువతి కూడా ఉంది. పోలీసులను గమనించి వైసీపీ నేత శంకర్ నాయక్ మంచం కింద దాక్కున్నాడు. సదరు నేత మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. సదరు నేత.. తరచుగా విద్యార్థుల కోసం, గిరిజనుల కోసం ఏదో పోరాటాలు చేస్తున్నట్లు.. సదరు నేత ఎప్పుడు చూసిన మీడియాలో ఉంటు హల్ చల్ చేస్తుంటారు. అలాంటి నేత.. ఇలా బైటపడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఛీ అసలు @ysjagan @YSRCParty అనేది ఒక పార్టీయేనా ..? pic.twitter.com/IGholeMfro
— Swathi Reddy (@Swathireddytdp) February 23, 2025
వైసీపీ అధినేత జగన్‌కు శంకర్ నాయక్ అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్నాడు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్ నాయక్ ఈ నెల 9వ వరకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడుగా ఉన్నాడు. వ్యభిచారం చేస్తు అడ్డంగా దొరికిపోయి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు.
ఇదిలా ఉండగా.. చలసాని భార్గవ్ అనే వ్యక్తి విజయవాడ గురునానక్ కాలనీలో స్టూడియో 09 పేరుతో ఓ స్పా సెంటర్ నడుపుతున్నాడు. దీనిలో స్పాపేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. కొంత మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Read more: Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..
తాజాగా ఇక్కడ జరుగుతున్న యవ్వారంను ఒక యువకుడు ఏకంగా వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేత అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి