Tabu Viral Photo: ఎన్నో రోజులపాటు తెలుగు ఇండస్ట్రీలో.. అలానే హిందీ ఇండస్ట్రీలో.. స్టార్ హీరోయిన్గా కొనసాగింది టబు. దాదాపు ఆమె అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే పెళ్లి మాత్రం ఇప్పటివరకు చేసుకోలేదు. ఒక తెలుగు హీరోతో రూమర్స్ వచ్చినప్పటికీ దానిపైన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఈ నటి.
టబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించిన ఈ నటి పెళ్ళికి మాత్రం దూరంగా ఉంది. ఒక స్టార్ తెలుగు హీరోతో రూమర్స్ వచ్చినప్పటికీ.. వాటిల్లో నిజం లేదు అని.. చెప్పుకుంటూ వచ్చింది. ఈ విషయాలు పక్కన పెడితే..టబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటు ఉంటాయి.
ఇప్పుడు ఈ నటి హాలీవుడ్ నటుడు మార్క్ స్ట్రాంగ్ ముంబయిలో.. ఒక రెస్టారెంట్లో కలిశారు. వీరిద్దరూ డ్యూన్ ప్రొఫెసీ చిత్రంలో కలిసి నటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టబు..మార్క్ స్ట్రాంగ్ ముంబయిలోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకుని సంబరంగా సమయం గడిపారు. టబు తెల్లటి బ్లేజర్, ప్యాంటుతో ఎంతో అందంగా కనిపించగా, మార్క్ స్ట్రాంగ్ నలుపు దుస్తుల్లో హుందాగా దర్శనమిచ్చారు.
టబు తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మార్క్ స్ట్రాంగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "గ్లామరస్, బ్యూటిఫుల్, టాలెంటెడ్.. టబు" అంటూ పెట్టాడు. టబు కూడా ఫోటోలను షేర్ చేస్తూ, "Javicco and Francesca reunite!" అంటూ పేర్కొన్నారు.
టబు.. మార్క్ స్ట్రాంగ్ భేటీపై అభిమానులు సంబరపడుతున్నారు. "వీరి కెమిస్ట్రీ అద్భుతం!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు, ఒక ప్రేమకథా చిత్రం చేస్తే బాగుంటుంది" అంటూ అభిప్రాయపడ్డారు.
టబు త్వరలో అక్షయ్ కుమార్‌తో కలిసి "భూత్ బంగ్లా" అనే హారర్-కామెడీ చిత్రంలో కనిపించనున్నారు. మార్క్ స్ట్రాంగ్, ఆపిల్ టీవీ ప్లస్ లో "న్యూరోమాన్సర్" అనే సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.