Samyuktha Menon: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు లేక సంయుక్త మీనన్ 66 ఏళ్ల ముసలాడైన నటుడితో రొమాన్స్ చేసిన సన్నివేశాలు ఇప్పుడు.. వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు అందరిని ఆశ్చర్యపరిస్తున్నాయి.
టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరుపొందింది యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్.. వరుసగా భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్ష, సార్, డెవిల్ వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా సంయుక్త మీనన్ బాలయ్య నటిస్తున్న అఖండ-2లో నటిస్తూ ఉన్నది. సంయుక్త ఎలాంటి పాత్ర చేసిన వాటి వెనుక ఏదో ఒక మర్మం ఉంటుందనే విధంగా అభిమానులలో ముద్ర పడిపోయింది.
అటు అందం, అభినయంతో సినిమాలలో రఫ్ ఆడిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు , తమిళ వంటి చిత్రాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
దీంతో అప్పుడప్పుడు సంయుక్త కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో సినిమా అవకాశాలు లేని సమయంలో సంయుక్త మీనన్ సీనియర్ నటుడు నాజర్ తో కలిసి కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించింది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎరీడ అనే తమిళ సినిమాలో నటించింది. ఇందులో నాజర్ తో కలిసి రొమాన్స్ చేసిన వీడియోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే అందులో కూడా చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా కుర్రాళ్లకు సైతం మత్తెక్కించేలా సంయుక్త కనిపిస్తుంది. అయితే మరి కొంతమంది ఈ వీడియోలను ఫోటోలను చూసి ట్రోల్ కూడా చేస్తున్నారు.. అయితే ఫేమస్ కాకముందు ఈ సినిమాలో నటించిన సంయుక్త ఫేమస్ అయిన తర్వాత ఈ సినిమానే శాపంగా మారినట్టు పలువురు నెటిజన్స్ చేస్తున్నారు.
66 ఏళ్ల ముసలాడితో సంయుక్త ఎలా రొమాన్స్ చేస్తుందో చూడండి అంటూ సోషల్ మీడియాలో సంయుక్తాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఇలాంటివి చేయకుండా సంయుక్త జాగ్రత్త పడుతుందేమో చూడాలి.