కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులు నటి రాగిణి ద్వివేది (Actress Ragini Dwivedi) ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారి నటి రాగిణి ద్వివేది ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి (Ragini Dwivedi Detained In Drug Case) తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక (Karnataka) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ (Riots)లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలి వానాల మారింది.
నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. భవనం (Building Collapse in Bengaluru) కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
Bengaluru in Lockdown: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజు రోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus ) కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ (Lockdown ) విధించింది. బెంగళూరులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో 14 రోజుల లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి అమలు చేసింది.
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.25 లక్షల నగదు, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.