Virat Kohli Records: దాయాదిపై మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లి

Virat Kohli Records: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏకంగా రెండు ఫీట్లు సాధించాడు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 09:47 PM IST
Virat Kohli Records: దాయాదిపై మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లి

Virat Kohli Records: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రెండు ఫీట్లు సాధించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఫామ్‌లో రావడమే కాకుండా కీలక ఘట్టాలను ఆవిష్కరించాడు. రెండు ఫీట్లు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 

దాయాది దేశం పాకిస్తాన్‌పై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 287 మ్యాచ్‌లలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 18,426 పరుగులు చేయగా రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 14,234 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 14 వేల పరుగులు చేసి మూడో ఆటగాడయ్యాడు. నాలుగో స్థానంలో రికీ పాంటింగ్ 13, 704 పరుగులు చేశాడు. ఐదవ స్థానంలో సనత్ జయసూర్య 14,430 పరుగులు సాధించాడు. 

ఇక మరో రికార్డు అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు. టీమ్ ఇండియా తరపున వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక క్యాచ్‌లు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ రికార్డు బ్రేక్ చేశాడు. టీమ్ ఇండియా తరపున విరాట్ కోహ్లీ 158 క్యాచ్‌లతో మొదటి స్థానంలో రాగా, 156 క్యాచ్‌లతో మొహమ్మద్ అజహరుద్దీన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక 140 క్యాచ్‌లతో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉండగా, 124 క్యాచ్‌లతో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ఇక సురేశ్ రైనా 102 క్యాచ్‌లు పట్టాడు.

Also read: Aarogya Sri Scheme: ఏపీలో ఆగిపోనున్న ఆరోగ్య శ్రీ, ఏప్రిల్ నుంచి కొత్త పధకం, ఎలా ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News