Nara Lokesh In Ind vs Pak Match: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే మ్యాచ్‌లో ఏపీకి చెందిన నారా లోకేశ్ ప్రత్యక్షమవడం తీవ్ర దుమారం రేపుతోంది. నారా లోకేశ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రాజకీయ వివాదానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే వినోదాలకు సమయం కేటాయించడంపై వివాదంగా మారింది. పాలన వదిలేసి క్రికెట్ మత్తులో మునుగుతున్న నారా లోకేశ్ తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.
Also Read: Ration Rice: సీజ్ ది షిప్ ఫెయిల్యూర్.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కనిపించారు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నారా లోకేశ్ స్టాండ్స్‌లో కూర్చున్నారు. లోకేశ్‌తోపాటు పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ కనిపించాడు. మ్యాచ్ వీక్షించేందుకు నారా లోకేశ్ ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. క్రికెట్ స్టేడియంలో లోకేశ్ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే లోకేశ్ పాలన వదిలేసి వినోదం కోసం విదేశాలకు వెళ్లడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలతోపాటు వివిధ వర్గాలు లోకేశ్ తీరుపై మండిపడుతున్నాయి.
Also Read: APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల స్పందించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. 'రోమ్ నగరం తగలాడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు గ్రూప్ 2 పరీక్షను గంగలో కలిపి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన లోకేశం క్రికెట్ మ్యాచ్ చూస్తూ జాలిగా గడుపుతున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు నిరుద్యోగులు ఏమైతే నాకేంటి అన్నట్టు సీఎం చంద్రబాబు పుత్ర రత్నం, విద్యా శాఖ మంత్రి ఆటవిడుపులో ఉన్నారు' అని విమర్శించారు.
'నవ్వాలో ఏడువాలో అర్ధం కానీ దుర్బాగ్య పరిస్థితిలు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి' అని చంద్రబాబు పాలనపై శ్యామల మండిపడ్డారు. 'ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగులు అల్లాడుతుంటే దుబాయ్‌లో దుబారా తిరుగుళ్లు తిరగడం మీకే సరిపోయింది రెడ్ బుక్ గారికి. విద్యా శాఖ మంత్రిగా సమస్యను చక్కదిద్దాల్సిన మీరు అంగడిలో అమ్మా అంటే ఎవరికీ పుట్టావు బిడ్డా అనే చందంగా ఉంది మీ యవ్వారం' అంటూ లోకేశ్‌పై తీవ్రస్థాయిలో శ్యామల ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.