Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభమైంది.
National Education Policy: ఏపీలో విద్యా సంస్కరణల్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఛైర్మన్ ప్రశంసలు కురిపించారు.
AP Governor: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా పనిచేసింది. మౌళిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలివి.
AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ హఠాత్తుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్‌వేవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Ys jagan review on polavaram: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం, పనుల్లో క్వాలిటీ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్..కొన్ని సూచనలు చేశారు.
APPSC JOBS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వందల పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి.
Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఉక్కుకు కేరాఫ్ ప్లాట్‌ఫామ్‌గా మారనుందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా పెద్దఎత్తున స్టీల్ కంపెనీలు ముందుకొస్తున్నాయి.
AP Nominated Posts: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేషన్ పదవుల పందేరం పూర్తయింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్ని ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
AP IT Policy 2021-24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీను విడుదల చేసింది. ప్రోత్సాహకాలు అందిస్తూ..ఐటీ రంగాన్ని అభివృద్ది చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. రానున్న నాలుగేళ్ల కోసం ఏపీ ఐటీ పాలసీ 2021-24 విధి విధానాలు ఇలా ఉన్నాయి.
EWS Reservations: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీలో మోక్షం కలగనుంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు అందించాల్సిన ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపులిచ్చారు. రేపట్నించి కేవలం నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. వ్యాక్సినేషన్, సంక్షేమ పథకాల అమలుతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్గింది. రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరికి స్థాన చలనం కలిగితే.. మరికొందరికి డీజీపీ ఆఫీసులో రిపోర్టింగ్‌కు ఆదేశాలొచ్చాయి.
Krishna water Dispute: కృష్ణా నదీ జలాల వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా మొన్నటి వరకూ తీవ్రంగా ఉన్న కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.