India Beat Bangladesh By 6 Wickets: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొట్టింది. బౌలింగ్.. బ్యాటింగ్‌లో సమష్టిగా ఆడి తొలి విజయాన్ని నమోదు చేసుకోగా.. ప్రత్యర్థి బంగ్లాదేశ్ తీవ్రంగా శ్రమించి మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదుర్కోగా.. టీమిండియా శుభారంభం చేసింది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఉత్కంఠ కలిగించింది.
Also Read: Champions Trophy 2025 Ind Vs Ban: శుభమన్ గిల్ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌటైంది. తౌహిద్ హ్రుదయ్ 118 బంతుల్లో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదినా నిలకడగా మైదానంలో ఉండి జట్టు మోస్తరు స్కోర్ నమోదయ్యేలా ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జేకర్ అలీ, హృదయ్ అద్భుతంగా ఆడారు.
ఐదుగురు డకౌట్
తాంజిద్ హసన్ (25), రిషద్ హోస్సేన్ (18) కొన్ని పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్, కెప్టెన్ నజ్ముల్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తఫిజర్ రహ్మన్ ఐదుగురు డకౌట్ కావడం జట్టును దెబ్బతీసింది. భారత బౌలర్లు పకడ్బందీగా బంతులు వేసి బంగ్లాను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. ఐసీసీ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి పలు రికార్డులు నమోదు చేయగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు తీశాడు.
Also Read: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన షమీ, హృదయ్.. భారత లక్ష్యం 229
బంగ్లాదేశ్ విధించిన మోస్తరు 229 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 231 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ తన భారీ హిట్లతో చెలరేగి ఆడి 41 పరుగుల వద్ద ఔటవగా.. కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) అతి తక్కువ పరుగులకు పరిమితమయ్యాడు.
వైస్ కెప్టెన్ ప్రదర్శన
జట్టు కొంత కష్టాల్లోకి వెళ్తున్న సమయంలో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతంగా ఆడాడు. వచ్చిన బ్యాటర్లతో చక్కటి భాగస్వామ్యం చేసుకుంటూ గిల్ సెంచరీని నమోదు చేశాడు. 129 బంతులు ఆడి 101 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి కెప్టెన్ అయ్యే లక్షణాలను తనలో గిల్ కనబర్చాడు.
షమీ, గిల్ రికార్డులు
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాట్‌తో నిలకడగా ఆడుతూ శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన కళ్ల ముందు నాలుగు వికెట్లు కోల్పోయినా ఒత్తిడికి గురి కాకుండా గ్రౌండ్‌లో కుదురుకుని బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా దిగి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు. ఐసీసీ వేడుకల్లో షమీ తన సత్తాను మరోసారి చాటాడు. ఐదు వికెట్లు పడగొట్టి షమీ తన పేరిట కొన్ని రికార్డులు నమోదు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి