Actress sreeleela funny video: శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పుష్ప2 మూవీలో చేసిన కిస్సిక్ ఐటెమ్ సాంగ్ నటికి ఒక రేంజ్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో ఐటెంసాంగ్ తర్వాత.. శ్రీలీలను ఎక్కడికి వెళ్లిన అందరు కూడా కిస్సిక్ పాప అంటూనే ఫన్నీగా పిలుస్తున్నారంట. అయితే.. శ్రీలీల పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కిస్సిక్ పాప.. ప్రస్తుతం నితిన్ సరసన రాబిడ్ హుడ్ సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీకి వెంకి కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మరొవైపు నితిన్ తో గతంలో శ్రీలీల.. ఎక్స్ ట్రా ఆర్డీనరీ మ్యాన్ లో కూడా నటించారు. అదే విధంగా ప్రస్తుతం కిస్సిక్ పాప బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల హిందిమూవీలో నటిస్తున్నారు.
Cutest video on internet ❤️❤️🥹@sreeleela14 #Sreeleela pic.twitter.com/o8xckGmsor
— Team Sreeleela™️ (@Teamsreeleela) February 19, 2025
దీన్ని అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. వచ్చే దీపావళికి కానుకగా ఇది విడుదల కానుందని సమాచారం. అయితే.. శ్రీలీల ప్రస్తుతం పల్లి కారప్పొడిని అన్నంలో కల్పుకుని తింటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
నటి శ్రీలీల డైనింగ్ టేబుల్ మీద అన్నంలో.. పల్లీ కారంపొడిని కల్పుకుని తిన్నారు. అంతేకాకుండా.. ప్రతిరోజు కారం అన్నం తింటానని ఫన్నీగా మాట్లాడారు. మరో ఫన్నీ అంశమేంటంటే.. శ్రీలీల ఈ వీడియోలో.. కారంను ఇంగ్లీష్ లో ఏమంటారని పక్కన వాళ్లను అడుగుతుంది. పక్క వాళ్లు చిల్లీ పౌడర్ అనగానే.. ఆ తర్వాత మళ్లీ .. పల్లి కారం పొడితే అన్నంతింటానని ఫన్నీగా మాట్లాడింది.
మొత్తంగా శ్రీలీల పల్లికారంపొడితో అన్నం తిన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే.. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. రోజు కారం అన్నంతింటే..కారంను ఇంగ్లీష్లో ఏమంటారో ఎట్టామర్చిపోయావ్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఓర్నీ.. నీ అందం వెనుక కారం అన్నం సీక్రెట్ దాగుందా.. అంటూ.. మరికొందరు శ్రీలీలకు సెటైర్ లు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి