Viral Video: జూలో అమానుషం.. కోతిని చెప్పుతో కొడుతూ, ఉమ్మివేస్తు పైశాచికం .. వీడియో వైరల్..

Kankaria zoo video: అహ్మదాబాద్ లోని కంకారియా జూలో ఒక వ్యక్తి కోతుల్ని కొడుతూ, ఉమ్మివేస్తు పైశాచికంగా ప్రవర్తించాడు.  ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గామారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 12, 2025, 06:33 PM IST
  • అహ్మదాబాద్ జూలో షాకింగ్ ఘటన..
  • భగ్గుమన్న జంతు ప్రేమికులు..
Viral Video: జూలో అమానుషం.. కోతిని చెప్పుతో కొడుతూ, ఉమ్మివేస్తు పైశాచికం .. వీడియో వైరల్..

Man attacks on monkey in kankaria zoo video: సాధారణంగా జూలకు చాలా మంది తమఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో వెళ్తుంటారు. అక్కడ అనేక జంతువులు ఉంటాయి. వాటిని చూస్తు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అడవిలో ఉండే క్రూర జంతువులు సైతం.. జూ పార్క్ లో మనకు కన్పిస్తుంటాయి. ఈ క్రమంలో కొంత మంది జూలలో వెళ్లి జంతువులకు ఆహారం వేస్తుంటారు.

మరికొందరు జంతువుల పట్ల పైశాచీకంగా ప్రవర్తిస్తుంటారు. వాటిని రాళ్లతొ కొడుతూ, కర్రలతో ఏదో రకంగా వాటికి హనీ తలపెడుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన అహ్మాదాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వైరల్గా మారింది.

 

గుజరాత్ లోని అహ్మదాబాద్ కంకారియ జూలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  అబ్దుల్ అనే వ్యక్తి కోతులు ఉన్న బోను దగ్గరకు వెళ్లాడు. ఏదో తినుబండారాలు చూపిస్తు   వాటికి ఆహరం పెట్టినట్లు చేశారు. పాపం.. కోతులు ఏదో ఆహారం పెడుతున్నాడని అతని దగ్గరకు వచ్చాయి. ఇంతంలో కోతుల్ని చెప్పుతో కొడుతూ.. ఉమ్మివేస్తు పైశాచికంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా..కోతుల్ని బెదిరిస్తూ నానా రచ్చ చేశాడు.

ఈ ఘటన అక్కడున్న వీడియోలలో రికార్డు అయ్యింది. వెంటనే జూ సిబ్బంది రంగంలోకి దిగి అతడికి అక్కడే పనిష్మెంట్ ఇచ్చారు. ఇది కాస్త వైరల్ కావడంతో దీనిపై నెటిజన్ లు సీరియస్ అయ్యారు. జంతు ప్రేమికులు దీనిపై భగ్గుమంటున్నారు.

Read more: Viral Video: బాప్ రే.. మహిళ బ్యాక్ ప్యాంట్‌లో పేలిన మొబైల్ ఫోన్.. షాకింగ్ వీడియో వైరల్..

అమాయకంగా ఆహారం ఇచ్చినట్లు నటించి.. చెప్పుతో కొట్టేందుకు అతడికి మనసు ఎలా వచ్చిందంటూ కూడా మండిపడుతున్నారు. అతను చేసిన పనికి చట్టప్రకారం చర్యలు తీసుకొవాలని నెటిజన్ లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News