newly Bride attends groups2 exams in tirupati video: సర్కారు కొలువు సాధించాలని చాలా మంది యువత ఎంతో కష్టపడుతుంటారు. పగలనక రాత్రనక.. ఎంతో కష్టపడి చదుకుంటారు. అంతే కాకుండా.. ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని టార్గెట్ పెట్టుకుని తమ వాళ్లకు దూరంగా ఉండి కోచింగ్ లు తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు. సర్కారు కొలువు సాధించిన వాళ్లకు సమాజంలో లభించే గౌరవ మర్యాదలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా వీళ్లను తల మీద పెట్టుకుని మరీ ప్రశంసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం సర్కారు కొలువు కోసం ప్రభుత్వాలు గ్రూప్ ఎగ్జామ్ ల కోసం నోటిఫికేషన్ లు వేస్తుంటాయి.
పెళ్లి నుండి గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు
పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి
తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు
చిత్తూరులో ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత
గ్రూప్ 2 పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా… pic.twitter.com/euHqbDfQIc
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025
అయితే.. ఇటీవల గ్రూప్స్ ఎగ్జామ్ లు తరచుగా కోర్టు కేసుల వివాదాలలో చిక్కుకుంటున్నాయి. అందుకే చాలా మంది ఈ గ్రూప్ ఎగ్జామ్ లలో పడి.. ఏళ్లకు ఏళ్లు తమ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్ లు అనేక ఆంటకాల మధ్య ఈరోజు ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈరోజు ఎగ్జామ్ సెంటర్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన నమిత అనే యువతికి అప్పుడే పెళ్లి జరిగింది.
ఒకవైపు ఏళ్లుగా కష్టపడిన ఎగ్జామ్.. మరొవైపు జీవితంలో ఒక పెద్ద శుభకార్యం. అయితే.. యువతి నమిత ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసింది. ఉదయంపూట తొందరగా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఆ తర్వాత గ్రూప్ 2 కోసం సెంటర్ కు వచ్చింది. ఈ ఘటన తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రం దగ్గర చోటుచేసుకుంది. యువతి కూతురు చీర లోనే పెళ్లికి వచ్చింది. ఆమె తల మీద తమలపాకు జీలకర్ర, బెల్లం కూడా అలానే ఉన్నాయి. ఆమె ఎగ్జామ్ సెంటర్ కు వచ్చి.. తన హల్ టికెట్ అంతా చెక్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి కాలేజీకి వెళ్లింది.
నవవధువులను.. ఆమె ఇంటి వాళ్లు ఎంతో జాగ్రత్తగా సెంటర్ వరకు తీసుకొచ్చి డ్రాప్ చేశారు. యువతి డెడికేషన్ కు అక్కడున్న వారంతా.. ఫిదా అవుతున్నారు. మొత్తంగా యువతి పెళ్లి దుస్తుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ కు రావడం ప్రస్తుతం వైరల్ గా మారింది. యువతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి