Pawan Kalyan Comments On Balakrishna: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘యూఫోరియా’ మ్యూజికల్ నైట్ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ప్రచార పటాటోపం లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమన్నారు. ఈ సందర్బంగా ఇలాంటి అద్బుత కార్యక్రమానికి తనను ప్రత్యేకంగా ఫోన్ చేసిన పిలిచినందుకు మేడమ్ భువనేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు పవన్ కళ్యాణ్. మేడం భువనేశ్వరీ కి ఒకటే చెప్పాను. మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని. మీరు ఫోన్ చేయక్కర్లేదని వేదికపై పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.భువనేశ్వరి గారంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఒడిదుడుకుల్లో కష్టాల్లో చెక్కు చెదరని సంకల్పం ఆమె సొంతమన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎన్టి రామారావు మెమోరియల్ ట్రస్ట్ కోసం ఈ ప్రోగ్రాం జరగటం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా తల సేమియా పేషెంట్స్ కోసం జరగటం చాలా హ్యాపీగా ఉందన్నారు.
మరోవైపు బాలకృష్ణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆయన నన్ను ఎప్పుడూ నన్ను ప్రేమగా బాలయ్య అని పిలువు అంటారు.కానీ నేను ఎప్పుడూ సార్ అనే పిలవాలనిపిస్తోంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉందన్నారు. ముఖ్యంగా ఎవ్వరిని లెక్క చేయని వ్యక్తిత్వం.. తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి బాలయ్య అన్నారు. ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం అన్నారు పవన్ కళ్యాణ్. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సినిమాల్లోనే కాదు చారిటీస్ లో కూడా ముందు ఉంటారు. ఆ చారిటీస్ ని గుర్తించే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించిదన్నారు.
ఈయన మాముల బాలకృష్ణ కాదు.. పద్మభూషణ్ బాలకృష్ణగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ ట్రస్ట్ కి చాలా భవిష్యత్తు ఉందన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా సైలెంట్ గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది. నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే చాలా మంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాలలో మేము డబ్బుల కోసం చేస్తాం. కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ కి వచ్చి చాలా మంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఎన్టి రామారావు గారు మన మధ్య లేకపోయినా గాని ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం..దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని అన్నారు.
అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసేమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయమన్నారు.
నేను ఎన్టీఆర్ ట్రస్ట్ కి కాకుండా చీఫ్ మినిస్టర్ ఫండ్స్ కి మన సంక్షేమ నిధికి ఒక లెటర్ రాస్తే ఆయన వెంటనే స్పందించే విధానం గొపపదన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు, భువనేశ్వరితో పాటు బాలకృష్ణ, లోకేష్, నారా బ్రాహ్మాణి అందరు ఈ ట్రస్టు ముందుకు నడిపించడంలో ముందున్నారు. ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ప్రత్యేక అభినందనలు. నేను ఈ వేడుకకు రూ. 1500 పెట్టి రాలేదు. అందుకే తలసేమియా బాధితుల కోసం రూ. 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్.అంతేకాదు త్వరలో ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తామన్నారు పవన్ కళ్యాణ్.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.