Janasena: పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభా పక్ష సమావేశం..

Janasena: నేటి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహం పై పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసన సభా పక్షం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటిలో సభలో ప్రతిపక్ష వైసీపీ తమ పార్టీపై దూషించినా.. రెచ్చగొట్టినా.. ఎలా బిహేవ్ చేయాలనే దానిపై ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు దిశా నిర్దేశం చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 24, 2025, 09:35 AM IST
Janasena: పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభా పక్ష సమావేశం..

Janasena: వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్సీపీ సభ్యులు శాసనసభలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా.. జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని  ఈ పార్టీ సుప్రీమో పవన్‌ కల్యాణ్ ఎమ్మెల్యేలకు‌ దిశానిర్దేశం చేశారు. సభలో హుందాగా వ్యవహరించాలన్నారు. YCP సభ్యుల ట్రాప్‌లో పడొద్దని పిలుపునిచ్చారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష, విధానం ప్రజలంతా గమనించారన్నారు పవన్‌ కల్యాణ్‌. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో  జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో  అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన  జరిగింది.

ఈ సమావేశంలో జనసేన సభ్యులకు పలు సూచనలు చేశారు పవన్‌ కల్యాణ్‌. YCP ప్రతినిధుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దన్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో  సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా  అభ్యంతరకర పదజాలం వాడొద్దుని గట్టిగా చెప్పారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలే వినియోగించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తించుకోవాలన్నారు.  భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేదానిపై నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్‌ సభ్యులకు  గైడ్‌ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. చర్చల్లో పాల్గొనాలని సూచించారు. సామాన్యుడి గొంతుగా నిలవాలన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రయోజన అంశాల్ని జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాల్లో లేవనెత్తాలన్నారు. ఇతర అంశాలపై జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. సందేహాలుంటే సీనియర్ల సలహాలు తీసుకోవాలని సూచించారు. జనసేన సభ్యులంతా బడ్జెట్‌ను అధ్యయనం చేయాలన్నారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News