AP Mirchi Farmers: పంటకు మద్దతు ధర లేకపోవడం.. కొనుగోలు కేంద్రాలు ఉండకపోవడం మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వారి సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనతో సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. మిర్చి పంటపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read: Chandrababu Letter: వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు.. మిర్చి రైతుల కోసం లేఖ
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపరిశీలన చేస్తోంది. 75 శాతం మేర పంట కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపిందని సమాచారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర-ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మిర్చి రైతుల అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లడంతో ఈ అంశాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధిక ప్రాధాన్యం తీసుకున్నారు.
Also Read: YS Sharmila: మాజీ సీఎం జగన్‌కు అంత దమ్ము, ధైర్యం లేదు: వైఎస్ షర్మిల
మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలన చేస్తున్నారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంటర్ వెన్షన్ స్కీమ్ పథకం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేసుకుని పరిష్కారం కనుగొనాలని చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు విజ్ఞప్తి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. ఏపీ మిర్చి రైతులకు చేయూత విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉన్నతాధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి చర్చిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.