Pension Cut In AP: ఏపీ ప్రభుత్వం జారీ చేస్తున్న పింఛన్ల లో అక్రమాలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది.
ఈ క్రమంలోనే పించన్లను తనిఖీ చేస్తోంది. అయితే అవి మరో మూడు వారాల్లో ముగుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యం, దివ్యాంగుల కేటగిరిలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగుల సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్నారు. ఈ మొత్తం సంఖ్యలో 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ తనిఖీ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. అయితే గత ప్రభుత్వ హాయాములో అనర్హులైన చాలా మందికి ఈసామాజిక పింఛన్లు అంజేసినట్టు ప్రభుత్వం వద్ద సమాచారం ఉండటంతో ఇపుడు అర్హులను తేల్చే పనిలో పడింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డాక్టర్ల చే నిర్ధారణ చేసిన వాళ్లే దివ్యాంగుల పెన్షన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకమ్ టాక్స్ పరిధిలో ఉండి .. పింఛన్ పొందుతున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపాలనే యోచనలో సర్కారు ఉంది. అలాగే యేడాదికి మూడు గ్యాస్ సిలిండర్స్ విషయంలో ఆధార్, ప్యాన్ అనుసంధానం చేసి అర్హులనే తేల్చే పనిలో పడ్డారు. చాలా మంది ఆదాయపు పన్ను కడుతూ ప్రభుత్వ పథకాల లబ్ది పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.