Hyderabad school head master serious on pushpa 2 movie team: పుష్ప2 సినిమాకు వివాదాలు మాత్రం అస్సలు వదలట్లేదని చెప్పుకొవచ్చు. ఈ మూవీ డిసెంబరు 4న ప్రీమియర్ షో విడుదల నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప2 సినిమా తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చింది. దీంతో ఈ మూవీ వసూళ్ల పరంగా ఏ రేంజ్లో బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుందో.. వివాదాల పరంగా కూడా అంతే వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా.. పుష్ప2 సినిమా మూవీ టీమ్ పై ఐటీ దాడులు కూడా జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప2 మూవీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.ఈ మూవీపై హైదరబాద్ లోని యూసుఫ్ గూడకు చెందిన హెడ్మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా వల్ల తమ స్కూల్ లోని సగం మంది విద్యార్థులు చెప్పిన మాటలు వినట్లేదని.. మాట మాట్లాడితే.. పుష్ప2 సినిమాలోని డైలాగులు తగ్గెదెలా.. అంటూ కూడా రివర్స్ లో మాట్లాడుతున్నారు.
అంతేకాకుండా.. గంధపు చెక్కలు స్మగ్లింగ్ ల అంశం..ఇతర అంశాల గురించి అదేపనిగా చర్చించుకుంటున్నారన్నారు. పోలీసులకు పుష్ప2 ఏవిధంగా చెక్ పెట్టాడో.. అదే విధంగా ఉపాధ్యాయులకు చెక్ పెట్టే విధంగా ప్రవర్తించాలని కొంత మంది చెప్పిన మాట అస్సలు వినట్లేదని స్కూల్ హెడ్మాస్టార్ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు.. ఇలాంటి మూవీస్ కు సెన్సార్ బొర్డు ఏవిధంగా అనుమతి ఇస్తుందని కూడా సదరు హెడ్మాస్టర్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారు.
Read more: Poonam Pandey Video: పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం.. సెల్ఫీ పేరుతో అభిమాని పాడుపని.. వీడియో వైరల్..
ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది నెటిజన్లు కూడీ లేడీ హెడ్మాస్టార్ కు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ అంశం మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి