KTR COMMENTS:ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలన ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ నేపథ్యలోనే బండి సంజయ్ యాదాద్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్మీట్ అంటూ ఫేస్ బుక్లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.
Bandi Sanjay: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో గంటకో ట్విస్ట్ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట పర్యటన హై టెన్షన్ రేపుతోంది.
Munugode By Poll: Telangana BJP Chief Bandi Sanjay slams CM KCR. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి స్పీచ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Counter To TRS: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. ఓ వైపు మునుగోడు ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Bandi Sanjay Diwali: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో పండుగ మరింత ఉత్సాహంగా సాగింది. ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న నేతలు.. అక్కడే దీపావళి జరుపుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ETELA Rajender:అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా... హుజురాబాద్ లో ఘన విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఈటల రాజేందర్.హుజురాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీజేపీ పెద్దలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు.
Bandi Sanjay to Visit Delhi : మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. ఆ వివరాలు కింది వీడియోలో చూద్దాం.
Munugode Bypoll: బండి సంజయ్ దిగజారిపోయారని.. క్షుజ్రపూజలు చేస్తున్నాపని అసత్య ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత వైద్యం కోర్సును యూపీలోని బెనారస్ యూనివర్శిటీలో ప్రవేశపెట్టారని చెప్పారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం నెలకొంది.ఇంచార్జ్ పోస్టు నుంచి తొలగించాలంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారు.ఈ పరిణామాలతో అప్రత్తమైన బండి సంజయ్.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది
Rajakar Movie: కశ్మీర్ ఫైల్స్ సినిమా సమయంలోనే తెలంగాణలో రజకార్ ఫైల్స్ సినిమా తీస్తామని ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిజాం హయాంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలు, ప్రజలు పడిన కష్టాలపై రకరకాల వాదనలు ఉన్నాయి. హిందువులే టార్గెట్ గా రజకార్లు మారణహోమం స్పష్టించారని ఒక వర్గం ఆరోపిస్తోంది.
Jeevitha Rajasekhar to contest on BJP ticket: తెలంగాణ బీజేపిలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపి హై కమాండ్ జీవితకు టికెట్ హామీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ..బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.
Jeevitha Rajasheker: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా గడువున్నా ముందస్తు వస్తుందన్న ప్రచారంతో పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్న పార్టీలు తమ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.