Pawan Kalyan Complaint Against Srikalahasti CI Anju Yadav: జనసేన కార్యకర్త కొట్టె సాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా... ఎలాంటి మారణాయుదాలు ధరించకుండా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. సాయి కూడా అదేవిధంగా శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ స్థానిక సిఐ అంజూ యాదవ్ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టడం జరిగిందన్నారు.
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
Janasena Leader Satires on Minister Jogi Ramesh: పెడన: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత రాంసుధీర్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మైలవరం నుంచి అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తేనే.. పెడన వచ్చి పడ్డాడు అని అన్నారు.
Srikalahasthi CI Anju Yadav Beating Janasena Party Leader: శ్రీకాళహస్తీలో జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతపై అక్కడి సీఐ అంజూ యూదవ్ చేయి చేసుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ ఎలాగూ చేసుకోనియ్యరు. కనీసం శాంతియుతంగా కూడా మా నాయకులను నిరసనలు చేసుకోనివ్వరా అంటూ పోలీసులపై మండిపడ్డారు.
Pawan Kalyan Questions to AP CM YS Jagan: తాడేపల్లి గూడెంలో బుధవారం జరిగిన బహిరంగసభలో వారాహి వాహనం మీదుగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ... ఏపీలో వాలంటీర్ వ్యవస్థ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ రూలింగ్ పార్టీ ఇస్తోన్న కౌంటర్లకు సమాధానం ఇచ్చారు. తనకు వాలంటీర్ల మీద వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు. మీరు చేస్తున్న పనిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్న జగన్ తీరు మీదనే తన పోరాటం అని స్పష్టత ఇస్తూ అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు వరుసగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారంను ప్రజలు అడ్డుకున్నారు. తమకు ఏమీ అవసరం లేదని తిప్పి పంపించారు. వివరాలు ఇలా..
TDP Launches Nalugella Narakam To Defeat YSRCP: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో కొత్త జోష్ నింపుకున్న టీడీపీ.. తాజాగా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే కసితో ఉన్న తెలుగు దేశం పార్టీ తాజాగా 'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో ఒక కొత్త తరహా పొలిటికల్ క్యాంపెయిన్ కి రంగం సిద్ధం చేసింది.
YSRTP Merging In Congress: రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైఎస్సార్టీపీ విలీనం దిశగా చర్చలు మొదలుపెట్టారని.. వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందని రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే ఈ విషయంపై స్వయంగా స్పందించారు.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
Ambati Rambabu Comments on Pawan Kalyan: మరో 9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కోబోతున్నామో తమకు సరైన స్పష్టత ఉంది అని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో పాటు దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నాము. జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు.
IMD Alert: తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. అయితే తాజాగా రాష్ట్రప్రజలకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జూన్ 22కల్లా తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.
Pawan Kalyan Visits Yetimoga oF Kakinada: 'దానశీలి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ వారసులు మీరు.. తన, మన బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి తరాల సంపద మీరు.. ప్రభుత్వం విదిలించే అరకొర సాయానికి దేహీ అనాల్సిన పని మీకు లేదు. మీరు పది మందికీ మత్స్యసంపదను పంచే సంపద సృష్టికర్తలు. మీరంతా స్వయంశక్తి సాధించే దిశగా పుట్టిందే జనసేన షణ్ముఖ వ్యూహం.. ప్రతి మత్స్యకారుడు ఆర్థికాభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యం' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
New Political Party In Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. రామచంద్ర యాదవ్ అనే పరిశ్రామిక వేత్త ఏపీ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. త్వరలో ఏపీలోని మెజారిటీ ప్రజల కోరికల మేరకు నూతన పార్టీని ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు.
Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Andhra & Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. మరో రెండు రోజులపాటు ఇలానే తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.