India vs Pakistan Live Score: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వస్తున్న రోజు వచ్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు హోరాహోరీ పోరు జరగనుంది. రోహిత్ సేన హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ ఎప్పుడైనా ప్రమాదకరమే. తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి భారత్ ఆత్మవిశ్వసంతో ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్ నిస్తేజంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఓడిపోతే సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 2 గంటలకు టాస్ వేస్తారు. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.