Ind vs Ban Live: చాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకోవాలనే కసితో బరిలో దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం మ్యాచ్ ప్రారంభమవగా.. భారత్ టాస్ ఓడి బౌలింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు బంగ్లా ఆటగాళ్లు దిగగా.. వారిని భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలో జరుగుతున్న మ్యాచ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి..
భారత్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. విజయం కోసం తీవ్రంగా శ్రమించిన బంగ్లాదేశ్ ఓటమిని చవిచూసింది
కష్టాల్లో భారత్
మంచి ఆరంభం లభించినా.. మిడిలార్డర్ తడబడుతుండడంతో భారత్ కష్టాల్లోకి వెళ్తోంది. రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఔటయ్యారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శుభమన్ గిల్ నిలకడగా ఆడుతుండగా.. బ్యాటింగ్‌లోకి కేఎల్ రాహుల్ దిగాడు.
32వ ఓవర్ భారత స్కోర్ 151/4కు చేరింది.
నిలకడగా శుభమన్
23 ఓవర్లకు భారత స్కోర్ 112/2. రోహిత్ శర్మ, కోహ్లీ ఔటయినా నిలకడగా ఆడుతున్న శుభమన్ గిల్.
దూకుడుగా భారత్
లక్ష్యం 229 ఛేదించేందుకు భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతోపాటు యువ బ్యాటర్ శుభమన్ గిల్ బరిలో దిగారు. 8వ ఓవర్‌కు 50 పరుగులు సాధించారు.
భారత్ లక్ష్యం 229
మహ్మద్ షమీ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌ను గడగడలాడించగా.. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్ని తౌదోయ్ హృదయ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. వీరిద్దరూ రికార్డు సృష్టించడంతో ఈ మ్యాచ్‌లో పలు ఘనతలు నమోదయ్యాయి. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 49.4 ఓవర్లకు ఆలౌట్ కాగా.. భారత్ 229 పరుగుల లక్ష్యం చేధించాల్సి ఉంది.
సెంచరీ చేసిన హృదయ్.
ఐదో వికెట్ కోల్పోయిన సమయంలో.. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చిన హృదయ్ గొప్పగా ఆడాడు. మరో వికెట్ పడకుండా అడ్డుగోడగా నిలిచి నిలకడగా ఆడుతూ హృదయ్ పరుగులు రాణించాడు. గ్రౌండ్‌లో అద్భుతంగా నిలబడి స్కోర్ పెంచుతూ సెంచరీ నమోదు చేశాడు. మంచి భాగస్వామ్యం అందించిన జేకర్ అలీ వైదొలగగా.. అనంతరం మరో బ్యాటర్ కూడా పెవిలియన్ చేరినా హృదయ్ ఒత్తిడికి లోను కాలేదు. వరుస వికెట్లు పడుతున్నా టెన్షన్ పడని హృదయ్ అద్భతు ప్రదర్శన కనబర్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా,
బంగ్లాదేశ్ జట్టు
తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, తౌహిద్ హృదోయ్, నజ్ముల్ హుస్సేన్ సాంటో (కెప్టెన్), మెహిదీ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), రిషద్ హుస్సేన్, జకేర్ అలీ, తన్జీమ్ హసన్, తస్కిన్, ముస్తాఫిజుర్