IND vs AUS 4th ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

IND vs AUS 4th ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Last Updated : Mar 10, 2019, 01:29 PM IST
IND vs AUS 4th ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మొహాలి: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు 4వ వన్డేలో తలపడనున్నాయి. మొహాలి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా ఆసిస్ ఒక మ్యాచ్ గెలిచింది. ఈ ఆటలో ఆసిస్‌పై భారత జట్టు గెలిస్తే, సిరీస్ ఇక టీమిండియా వశమైనట్టే. అలా కాకుండా ఆసిస్ గెలిస్తే, ఇరు జట్లు సమానం అవుతాయి. 

3వ వన్డేలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ సైతం వృధా అయిన సంగతి తెలిసిందే. మరి రాంచి వన్డేలో నేర్చుకున్న గుణపాఠంతో టీమిండియా అప్రమత్తమైందా లేదా తెలియాలంటే ఈ మ్యాచ్ ఫలితం వెలువడే వరకు వేచిచూడాల్సిందే.

Trending News