Nurse Fevikwik treatment in Karnataka: సాధారణంగా మనలో చాలా మంది వైద్యుల్ని దేవుళ్లుగా భావిస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి వెళ్తాము. అక్కడ డాక్టర్లు మనకు ట్రీట్మెంట్ చేసి ప్రమాదం నుంచి బైటపడేలా చేస్తుంటారు. చాలా మంది వైద్యులు తమ వృత్తికి వందశాతం న్యాయం చేస్తారు. వైద్యులు, ప్రజల కోసం సేవలు చేయడానికి రాత్రనక, పగలనక కష్టపడుతుంటారు.
కానీ కొంత మంది వైద్య సిబ్బంది మాత్రం దీనికి భిన్నంగా కూడా ప్రవర్తిస్తారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల నెగ్లీజెన్సీగా ఉంటారు. రోగి బాధతో విలవిల్లాడిపోయిన అస్పలు పట్టించుకోరు. ఏదో ఫోన్ లలో రీల్స్ చూస్తే బీజీగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు. మరికొందరు వైద్యులు.. సర్కారు ఆస్పత్రిలో దండిగా జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కువగా తమ సమయం కేటాయిస్తుంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం కర్ణాటకలోని హవేరీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హనగల్ తాలుకాలోని స్థానిక ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 14 న గురుకిషన్ అన్నప్ప హోసమణి అనేక ఏడేళ్ల బాలుడు చెంప మీద గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న సిబ్బంది బాలుడ్ని చూశారు. డ్యూటీలో ఉన్న నర్సు బాలుడి చెంపను స్పిరిట్ లో క్లీన్ చేసింది.
చెంప మీద లోతుగా గాయాలు అయ్యాయి. బాలుడి కుటుంబ సభ్యులు కుట్లు వేస్తారని అనుకున్నారు. కానీ నర్సు మాత్రం.. ఫెవీక్వీక్ తీసుకుని బాలుడి చెంప మీద అప్లై చేసింది. దీంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. ఫెవీక్వీక్ ట్రీట్మెంట్ ఏంటని ప్రశ్నించారు. దీనికి ఆమె తీరిగ్గా.. తాను ఈ విధంగానే ట్రీట్మెంట్ చేస్తానని, కుట్లు వేస్తే చెంప మీద మచ్చలు ఏర్పడతాయని అందుకే ఈ విధంగా ఫెవీక్వీక్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
Read more: Viral Video: కుంభమేళాకు వచ్చి ఒక జంట పాడుపని.. ఆగ్రహాంతో నాగ సాధు ఏంచేశారంటే.. వీడియో వైరల్..
నర్సు చెప్పిన సమాధానంతో వారంతా బిత్తర ముఖం పెట్టారు. ఈ విషయాన్ని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పారు. దీనిపై వైద్యులు సీరియస్ అయ్యారు. సదరు నర్సును సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter