Danapur Express: రైలు కోచ్‌ చక్రాల కింద దాక్కొని 250 కీమీ ప్రయాణించిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే ఖంగుతినడం మీవంతు..!

Danapur Express Viral Video: ఓ వ్యక్తి ఇతార్షీ నుంచి జబల్పూర్ వరకు దనాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ భోగి కింద దాక్కొని 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. జబల్పూర్ స్టేషన్లో రైల్వే అధికారులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Dec 28, 2024, 02:54 PM IST
Danapur Express: రైలు కోచ్‌ చక్రాల కింద దాక్కొని 250 కీమీ ప్రయాణించిన వ్యక్తి.. అసలు విషయం తెలిస్తే ఖంగుతినడం మీవంతు..!

 Danapur Express Viral Video: నెట్టింటా  కొన్ని వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈరోజు కూడా అలాంటి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాము.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 250 కిలోమీటర్లు రైలు భోగి కింద చక్రాల మధ్య దాక్కొని ఓ వ్యక్తి ప్రయాణించాడు. ఇతార్షీ నుంచి జబల్పూర్ వెళ్లే రైలులో ఈ వ్యక్తి ప్రయాణం చేశాడు. అయితే జబల్పూర్ స్టేషన్ వచ్చాక రైల్వే అధికారులు అతని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన డిసెంబర్ 24న చోటుచేసుకుంది. ఇది దనాపూర్‌ ఎక్స్ప్రెస్ లో చోటుచేసుకుంది.

రైల్వే ఉద్యోగులు బోగీల సేఫ్టీని రొటీన్ చెక్ చేస్తుండగా ఈ వ్యక్తి కనిపించాడు.. S4 కోచ్ కింద భాగంలో దాక్కుని ఉన్నాడు. వెంటనే పై అధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు, లోకో పైలట్‌ను కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా వెంటనే అలెర్ట్ చేశారు. వెంటనే ఆ వ్యక్తిని బయటికి తీసుకువచ్చారు. అతను ఎందుకు ఇలా దాక్కొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది? అని అడగ్గా అతని వద్ద టికెట్ కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవటంలో ఇలా అత్యంత డేంజరస్ గా ప్రయాణం చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతిడిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. అతను మెంటల్ కండిషన్ కూడా బాగాలేదని గుర్తించారు. అయితే ఆ తర్వాత అతని వదిలేశారు. ప్రస్తుతం ఈ రైల్వే ఈ వ్యక్తి చేసిన 250 కిలోమీటర్ల జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే 250 కిలో మీటర్లు ఒక వ్యక్తి ట్రైన్‌ కింద భాగంలో చక్రాల మధ్య దాక్కొని ప్రయాణం చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదిలాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటపై అస్సలు నమ్మలేదు.

ఇదీ చదవండి:  న్యూ ఇయర్ వేళ మందు బాబులకు భారీ శుభవార్త ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

కొంతమంది అతని డబ్బు లేదని తెలియగానే అతనిపై జాలి చూపిస్తున్నారు. నిజంగానే డబ్బులు లేకపోవడం వల్ల టికెట్ కండక్టర్ పట్టుకుంటాడని అలా రైలు చక్రాల కింద భాగంలో దాక్కొని ప్రయాణించడేమో అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో కూడా మధ్యప్రదేశ్లో వ్యక్తి 20 కిలోమీటర్లు ఇలాగే ట్రైన్ కింద భాగంలో దాక్కొని ప్రయాణించడానికి మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

 

మరి కొందరేమో ఫన్నీగా రైలు చక్రాల కింద భాగంలో కూర్చొని ప్రయాణించడానికి అవకాశం ఉన్నప్పుడు టికెట్ ఎందుకు కొనాలి? అని క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా అతనికి డబ్బులు లేకుండా మెంటల్ కండిషన్ బాగోలేకున్నా కానీ ఏమాత్రం పొరపాటు జరిగిన ప్రాణాలకే ప్రమాదం వచ్చేది అంటున్నారు.

ఇదీ చదవండి: బావకు జాబ్‌ రాకుండా చేశానని సంబరపడిపోతున్న జో.. దీప కొత్త టిఫిన్‌ సెంటర్‌ 

 

అయితే ఈ వార్తపై రైల్వే మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఇది ఫేక్‌ అని ఎవరో వీడియో షాట్‌ కోసం ఇలా చేశారు. ఆ వ్యక్తి ఆగి ఉన్న రైలు చక్రం యాక్సెల్‌ నుంచి బయటకు వచ్చిన వీడియోనే ఉంది. ఇది కావాలని వైరల్‌ అవ్వడానికి ఇలా చేశారు. ఇది తప్పదోవ పట్టించే వార్త. నిరాధారం అని రైల్వే బోర్డు ఈడీ దిలీప్‌ కుమార్‌ చెప్పారు. ఒక వ్యక్తి కదులుతున్న రైలు చక్రం యాక్సెల్‌ కింద దాక్కొని ప్రయాణించడం సాధ్యం కాని పని నొక్కి చెప్పారు. ఆగి ఉన్న రైలు కింద భాగంలోనే అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇక కదులుతున్న రైలుతో ఎలా ప్రయాణిస్తాడు. కావాలలే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు దీన్ని వైరల్‌ చేశారు అని పేర్కొన్నారు. ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (PIB) కూడా ఇది నిరాధారం అని ఎక్స్‌ వేదికగా తెలిపింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

Trending News