Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో

Sankranthiki Vasthunnam: సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి బిగ్ అప్‌డేట్ వెలువడింది. వెంకీ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేసే శుభవార్త ఇది. ఈ సినిమాను ఓటీటీ లేకుండానే చూసేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2025, 05:15 PM IST
Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం తేదీ వచ్చేసింది, ఓటీటీ కంటే ముందే ఆ టీవీ ఛానెల్‌లో

Sankranthiki Vasthunnam: వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి నటీ నటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారికి మేజర్ గుడ్‌న్యూస్. ఓటీటీ కూడా అవసరం లేదు. ఇంట్లో టీవీలో చూసేయవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

సంక్రాంతి పర్వ దినాల్లో విడుదలైన మూడు మేజర్ సినిమాల్లో రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలయ్య నటించిన డాకూ మహారాజ్ ఇప్పటికే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఓటీటీ విడుదల తేదీ ప్రకటించకపోవడంతో సందిగ్ధత నెలకొంది. సినీ అభిమానులు ముఖ్యంగా వెంకీ అభిమానులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగారు. చివరికి ఇప్పుడు ఆ ఉత్కంఠత తొలగింది. అదే సమయంలో మరో శుభవార్త కూడా అందింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడ్డానికి ఇప్పుడు మీకు ఓటీటీ అవసరం లేదు. ఇంట్లో కూర్చుని హాయిగా టీవీ ఛానెల్‌‌లో చూడవచ్చు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా..నిజమే ఇది. 

ఓటీటీలో కాదు..ఛానెల్‌లో

సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఇందులో జీ5 ఓటీటీ, జీ తెలుగు టెలివిజన్ రెండూ ఉన్నాయి. జీ ఇప్పుడు అధికారికంగా సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ తేదీ ప్రకటించింది. మార్చ్ 1వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. అది కూడా జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకు జీ ఓటీటీ సభ్యత్వం అవసరం లేదు. ఉచితంగా ఇంట్లోనే మీకిష్టమైన జీ తెలుగు చానెల్‌లో చూసేయవచ్చు. ఇది నిజంగా సంచలన నిర్ణయం. మార్చ్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగులో వస్తుంది. సాధారణంగా ఎవరైనా సరే ముందు ఓటీటీలో తరువాత టీవీలో రిలీజ్ చేసేందుకు చూస్తారు. కానీ జీ మాత్రం అందుకు భిన్నంగా ముందు టీవీ ఛానెల్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఓటీటీ తేదీని వాయిదా వేసింది. 

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ కంటే టీవీ రిలీజ్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ సమయంలో టీవీ తెరపై భారీ తెలుగు సినిమా ప్రీమియర్లు లేకపోవడంతో మొత్తం సీజన్ క్యాష్ చేసేందుకు జీ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మార్చ్ 1 నుంచి జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందనుకున్నారు. కానీ జీ మాత్రం ముందు టీవీకే ప్రాధాన్యత ఇచ్చుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసింది. వెంకటేశ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు జరిపిన సినిమా ఇదే.

మరెందుకు ఆలస్యం ఇక ఓటీటీ అవసరం లేకుండానే మీకిష్టమైన జీ తెలుగు ఛానెల్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకు చూసేయండి.

Also read: PF Withdrawal: పీఎఫ్ కస్టమర్లకు ఊహించని శుభవార్త, యూపీఐ నుంచి డబ్బులు విత్ డ్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News