Team India: ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరేట్‌గా ఇండియా, బలాబలాలు, సాధ్యాసాధ్యాలివే

Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే  ర్యాంకింగ్‌లో ఛాంపియన్‌గా ఉన్న టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. 8 ఏళ్ల తరువాత జరగనున్న ఈ టోర్నీ టీమ్ ఇండియాకే కాదు..కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2025, 08:33 PM IST
Team India: ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరేట్‌గా ఇండియా, బలాబలాలు, సాధ్యాసాధ్యాలివే

Team India: రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్ ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సిద్ధమైంది. వన్డే ర్యాంకింగ్‌లో 119 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా నెంబర్ 1 జట్టుగా టోర్నీ బరిలో దిగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించేందుకు టీమ్ ఇండియాకు ఉన్న సాధ్యాసాధ్యాలు, బలాబలాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో గెల్చుకున్న టీమ్ ఇండియా ఉన్న గ్రూప్‌లోనే దాయాది దేశం పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే చాలా రకాల టెన్షన్ ఉంటుంది.  అంతర్గతంగా ఉండే ఒత్తిడి కంటే బయటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక న్యూజిలాండ్ ఈ మధ్యనే దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లతో ముక్కోణపు సిరీస్ గెల్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్ ఎలో అగ్రస్థానంలో నిలవాలంటే పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురు కానుంది. 

రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆఖరి టోర్నీ కావచ్చు. అటు విరాట్ కోహ్లీకు కూడా ఇదే చివరి టోర్నీ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం తిరిగి ఆడకపోవచ్చు. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ మధ్యనే ఫామ్‌లో రావడం టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసింది. కేఎల్ రాహుల్  ఫామ్‌లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక హార్దిక్  పాండ్యా అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించడం తప్ప పెద్దగా రాణించడం లేదు. అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు రాణిస్తే ఆల్ రౌండర్ విభాగంలో తిరుగు ఉండదు. ఇక  స్టాండ్ బైలో యశస్వి జైశ్వాల్, మొహమ్మద్ సిరాజ్, శివమ్ దూబే ఉన్నారు. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చివరి టోర్నీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మనసు పెట్టి గట్టిగా ఆడాల్సి ఉంటుంది. మర్చిపోలేని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ కెరీర్ పరంగా బాగుంటుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఇండియా జట్టు

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి

Also read: Champions Trophy 2025 Timetable: ఛాంపియన్ ట్రోఫీకు అంతా సిద్ధం, ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఫుల్ టైమ్ టేబుల్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News