Mirzapur: మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా వెళుతున్న 10 మంది భక్తులు మృత్యువాత..

Mirzapur Bolero Accident: ప్రయాగ రాజ్ వెళుతున్న భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ  ఘటనలో పదిమంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా యూపీలోని ప్రయోగ్‌ రాజ్‌  వెళ్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. వీళ్లంతా చత్తీస్‌ఘడ్‌ నుంచి మహా కుంభమేళకు వెళుతున్న భక్తులు.. వీళ్లు ప్రయాణిస్తున్న బొలేరోను ఓ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది.  

Written by - Renuka Godugu | Last Updated : Feb 15, 2025, 10:11 AM IST
Mirzapur: మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా వెళుతున్న 10 మంది భక్తులు మృత్యువాత..

Mirzapur Bolero Accident: చత్తీస్‌ఘడ్‌ నుంచి మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తులకు ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తోన్న బొలెరో కారును ఓ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు అక్కడికి అక్కడికే చనిపోయారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌ రాజ్‌ నుంచి మీర్జాపూర్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోలెరో నుజ్జునుజ్జయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను  బయటకు తీశారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి:  తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. గుంపులుగా మాత్రమే అనుమతి..  

ఇదీ చదవండి: మండే ఎండలు మార్చి 15వ తేదీ నుంచి జాగ్రత్త.. వాతావరణ శాఖ హెచ్చరిక..  

వీరంతా చత్తీగఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగ్ రాజ్‌ వెళుతున్నారు. అయితే వారు వెళుతున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సులో కూడా మధ్యప్రదేశ్ కి చెందిన బస్సుగా గుర్తించారు. అందులో కూడా కుంభమేళాకు వెళ్లే భక్తులు ఉన్నారు. ఈ ఘటనలో పదిమంది భక్తులు మృతి చెందారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వాళ్ళు. ఈరోజు అర్ధరాత్రి ప్రయాగ్రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్లే హైవే రోడ్ పై ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారంతా స్థానికంగా ఉన్న స్వరూపా రాణి మెడికల్ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రయాగ రాజ్ అడిషనల్ ఎస్పీ వివేక్‌ చంద్ర యాదవ్ తెలిపారు.

ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై ఆరా తీశారు. అక్కడ సహాయకపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా కుంభమేళా వెళుతున్న భక్తులకు వరుసగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం కూడా ఏడు మంది భక్తులు మరణించారు ఆంధ్రప్రదేశ్ వస్తుండగా టెంపో, ట్రక్కుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో  చోటు చేసుకుంది. అంతకు ముందు హైదరాబాద్‌కు చెందిన నలుగురు చనిపోయారు. అంతేకాదు సోమవారం నాడు ఆగ్రాకు చెందిన ఒక జంట కూడా తీవ్రంగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వాళ్లు కుంభమేళా నుంచి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఒడిశా కు చెందిన మరో వ్యక్తి కూడా రూర్కేలా వద్ద కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో మరణించారు.  ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్ర గాయాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో వాళ్ళ కారును ఒక బస్సు ఢీకొట్టడంతో  ఈ ఘటన చోటు చేసుకుందిజ దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రపంచ అతిపెద్ద మహాకుంభమేళకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 20వ తేదీ వరకు కొనసాగుతుంది.. ఇప్పటివరకు కొన్ని కోట్ల మంది భక్తులు కుంభమేళాలో స్నానం ఆచరించారు. మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానం పూర్తవుతుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ ప్రకారం శుక్రవారం ఒక్కరోజు సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 92 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News