Free Sand: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆర్థిక సహాయంతోపాటు ఉచితంగా ఇసుక ఇచ్చే అవకాశం ఉంది. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నగదు సహాయం అందిస్తుండగా.. దీనికి తాజాగా ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నలుగురితో కూడిన కమిటీని నియమించింది. కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ఇసుక ఉచిత పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Also Read: School Holiday: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు స్కూళ్లకు ఎలాంటి సెలవు లేదు
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కమిటీని నియమించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read: Telangana Investments: దావోస్ పెట్టుబడులన్నీ మేం తెచ్చిన ఘనతే: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష చేశారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక పంపిణీపై కూడా చర్చలు జరిపారు. ఇసుక ఎలా సరఫరా చేయాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని.. అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని గుర్తించారు.
వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని.. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీకి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.