LYF Teaser Launch: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసిన ఎల్.వై.ఎఫ్ (LYF) మూవీ టీజర్..

LYF Teaser Launch: తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు ఎన్నో తెరకెక్కాయి. ఈ రూట్లోనే వచ్చిన మరో మూవీ ‘లవ్ యువర్ ఫాదర్’ (LYF). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నప రెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ,  ఏ. రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2025, 12:30 PM IST
LYF Teaser Launch: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసిన ఎల్.వై.ఎఫ్ (LYF) మూవీ టీజర్..

LYF Teaser Launch: శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించగా..మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై  కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. తాజాగా  ఈ మూవీ టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసారు.  ఎల్ వై ఎఫ్ సినిమాలో  ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా, సంధ్య ముఖ్యపాత్రల్లో నటించారు.  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... "శ్రీహర్ష, కషిక కపూర్ జోడిగా నటించగా ఆడియన్స్ ముందుకు వస్తోన్న చిత్రం ‘ఎల్ వై ఎఫ్’.  మంచి కంటెంట్ తో  వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలన్నారు. సినిమాలు ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాలన్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం సబబు కాదన్నారు. తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిదన్నారు.  ఈ ఎల్ వై ఎఫ్ అనే చిత్రం అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందన్నారు. ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను ముందుంటానన్నారు. ఓటిటిలో అయినా థియేటర్లో అయినా తక్కువ బడ్జెట్ తో వచ్చే చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయన్నారు. కొత్త సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఈ చిత్రం కూడా అదే విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు. 

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News