Flying Deer Video Viral: సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన వీడియోలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు పదే పదే చూస్తూ ఉంటారు. వీటికి కామెంట్లు పెడుతూ ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా వైరల్ అయ్యే వీడియోలను సెర్చ్ చేస్తూ ఉంటారు. వాటిని లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ షేర్ చేస్తారు. ఎక్కువ శాతం సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని కోతులు ఇతర ఫన్నీ వీడియోలు కూడా వైరల్ అవతూ ఉంటాయి. ఈరోజు నెట్టింట్లో ఓ జింక అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
అయితే, సోషల్ మీడియాలో ఒక ఎగిరే జింక వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. సాధారణంగా జింక శాకహారి. ఇది మనం చూడగానే ఒక్క జంప్ చేసి అంత దూరం పారిపోతుంది. ఇవి చూడ్డానికి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. మనకు వాటి దగ్గరికి వెళ్లాలని అనిపిస్తుంది వాటిని పట్టుకోవాలని అనిపిస్తుంది. అయితే మీరు గాలిలో ఏడడుగుల ఎత్తున ఎగిరే జింకను మీరు ఎప్పుడైనా చూశారా? అవును నిజంగా మీరు చూసే వరకు నమ్మరు.. అలాంటి జింక ఉంది ప్రస్తుతం ఆ జింకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా జింకలు అడవిలో ఉంటాయి. ఇవి పులులు, సింహాలకు వేటగా మారతాయి, వాటి ప్రాణాలు కోల్పోతాయి. ఒక్కోసారి కొంతమంది మనుషుల చేతిలో కూడా ఇవి బలవుతూ ఉంటాయి. అయితే జింకలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇవి ఏమాత్రం అనుమానాస్పదంగా కదలికలు విన్న వెంటనే పారిపోతాయి. ఇవి మచ్చిక చేసుకుంటే మనతో సులభంగా కలిసి పోతాయి.
అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలో జింక ఒక్క ఉదుకునా ఇటునుంచి అటు ఏడు అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించింది. ఈ వీడియ చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఈ వైపు నుంచి ఆ వైపు ఒక్క దూకు దూకింది. అది దాదాపు ఏడడుగుల ఎత్తులో కాసేపు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించింది. వీడియో చూసిన వారంతా వావ్ అని ఆశ్చర్యపోతున్నారు.
And the gold medal for long & high jump goes to.......@ParveenKaswan
Forwarded as received pic.twitter.com/iY8u37KUxB— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) January 15, 2022
ఈ వీడియోలో జింక వేగంగా పరిగెత్తడమే కాకుండా ఆకాశంలో కూడా ఎగరడంతో సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ల ఫ్రెండ్స్, బంధువులకు షేర్ చేస్తున్నారు వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు ఇలాంటి జింకను ఎప్పుడూ చూడలేదు అంటున్నారు. మరీ ఈ వీడియోను మీరు చూశారా? మీరు ఎలా ఫీలవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.