Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం, అధికార ఆప్ పరాజయంపై విభిన్న రకాల వాదనలు విన్పిస్తున్నాయి. బీజేపీ విజయానికి కారణాలేంటో తెలియదు గానీ ఆప్ పరాజయానికి మాత్రం ప్రతిపక్షాల అనైక్యతే కారణంగా తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టే ఉన్నా ఆప్ అధికారం కోల్పోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ విజయానికి కారణాలేంటని విశ్లేషించుకుంటే ఆప్ పరాజయానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల్లో అనైక్యతే ఆప్ పరాజయానికి కారణంగా తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అందుకే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం కొట్టుకోవడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయంటున్నారు. మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో అందుకు తగ్గట్టుగా రామాయణం నుంచి ఓ చిన్న క్లిప్పింగ్ షేర్ చేశారు.
ఆపస్ మే ఔర్ లడో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలోని ఆప్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం వ్యతిరేకంగా విమర్శలు చేసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ , ఆప్ పార్టీలు ఒంటరిగా బరిలో దిగడంతో ఓట్లు చీలిపోయాయి. కాంగ్రెస్ ఖాతా తెరవకపోయినా ఆప్ ఓటు బ్యాంకుకు గండి కొట్టింది. 1998 నుంచి 2013 వరకూ 15 ఏళ్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2013లో 24.70 శాతం ఓట్లతో 7 సీట్లు, 2015లో 9.7 శాతం సీట్లతో సున్నా సీట్లు, 2020లో 4.3 శాతం ఓట్లతో సున్నా సీట్లు సాధించింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదని ఆప్ నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగింది. చాలా నియోజకవర్గాల్లో ఆప్ స్వల్ప మెజార్టీతోనే పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లను చీల్చడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మనం మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయనే వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి