Poonam Pandey Video: పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం.. సెల్ఫీ పేరుతో అభిమాని పాడుపని.. వీడియో వైరల్..

Fan forcibly try to kiss poonam pandey: పూనమ్ పాండే దగ్గరకు వెళ్లి ఒక అభిమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  దీనిపై నటి  పూనమ్ సీరియస్ అయ్యింది. ఈ ఘటన దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 23, 2025, 07:03 PM IST
  • పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం..
  • ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Poonam Pandey Video: పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం.. సెల్ఫీ పేరుతో అభిమాని పాడుపని.. వీడియో వైరల్..

Fan trying to kiss poonam pandey video viral: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ప్రస్తుతం పూనమ్ పాండేకు చోటు చేసుకున్న ఘటన నెట్టింట దుమారంగా మారింది. దీనిపై అభిమానులు సైతం మండిపడుతున్నారు. పూనమ్ పాండే ఇటీవల ముంబైలో రోడ్డు మీద షూటింగ్ చేస్తుండగా  ఒక అభిమాని అక్కడకు వచ్చాడు. పూనమ్ పాండేతో సెల్ఫీదిగేందుకు ప్రయత్నించాడు.

తొలుత పూనమ్ పాండే ఒక్కసారిగా అతడ్ని చూసి షాక్ కు గురైంది. అక్కడున్న సిబ్బంది తన షూటింగ్ లో ఉన్నారని.. తర్వాత ఫోటోలు దిగాలని చెప్పారు. కానీ అతగాడు.. మాత్రం అవన్ని లెక్కచేయకుండా.. పూనమ్ తో సెల్పీలు దిగేందుకు ప్రయత్నించాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

నటి కూడా చేసేదేమీ లేక.. సెల్పీనే కదా.. అనుకొని ఫోటో కోసం పోజు ఇచ్చింది. ఇంతలో అతను సెల్ఫీ పేరుతో నటి దగ్గరకు వచ్చాడు. పూనమ్  చెంపపై ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో నటి ఒక్కసారిగా టెన్షన్ కు గురైంది. అక్కడున్న వారు సైతం.. అతగాడ్ని దూరంగా తోసేశారు. ఆ కేటుగాడు.. ఫోటో పేరుతో నటిని ముద్దుపెట్టుకుని, అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు.

Read more: Ritu Varma: ముద్దులు, హగ్ లకు ఎప్పుడు రెడీనే.. బాంబు పేల్చిన రీతు వర్మ.. మ్యాటర్ ఏంటంటే..?

అక్కడున్న వాళ్లు.. ఇతని ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అభిమానంపేరుతో ఇలాంటి పాపిష్టిపనులు ఏంటని కూడా మండి పడుతున్నారు. మరికొందరు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Trending News