Madha Gaja Raja Review and Rating:
కథ
రాజు (విశాల్) తన స్నేహితుల కోసం ఎలాంటి కష్టమైన ఎదుర్కొనే వ్యక్తి. చిన్నప్పటి మాస్టారు ఇంట్లో పెళ్లికి వెళ్లిన అతను, అక్కడ జరిగే సమస్యల్ని పరిష్కరిస్తాడు. ఈ క్రమంలో, అతని స్నేహితుల్ని కాకర్ల విశ్వనాథ్ (సోనూ సూద్) అనే వ్యక్తి చాలా ఇబ్బందులకు గురి చేశారని తెలుసుకుంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రభావితం చేసే ఈ పవర్‌ఫుల్ విలన్‌ను రాజు ఎలా ఎదుర్కొన్నాడు? అతని ప్రయాణంలో మాయ (వరలక్ష్మీ శరత్‌కుమార్), అంజలి పాత్రలు ఎంత ముఖ్యమైనవి? అనే దానిపై సినిమా కొనసాగుతుంది.
విశ్లేషణ
మద గద రాజ సినిమాను ఒక స్టాండర్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా చెప్పొచ్చు. ఇది పన్నెండేళ్ల క్రితం తీసిన సినిమా కాబట్టి, దాని మేకింగ్, టేకింగ్, కథన శైలి అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో సాదారణంగా కనిపించే ఫార్మాట్— ఓ హీరో, రెండు హీరోయిన్‌లు, ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్లకు ఎదురయ్యే సమస్య, ఆ సమస్యను పరిష్కరించేందుకు హీరో చేసే ప్రయత్నాలు— ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయి.
కథలో లాజిక్స్ ఎంతవరకు ఉన్నాయో వెతకడం కన్నా, పూర్తిగా వినోదం కోసం చూడాలనుకునేవారికి ఈ సినిమా సెట్ అవుతుందనిపిస్తుంది. కథలో మైనస్ పాయింట్స్ ఉన్నా, హాస్య నటుడు సంతానం తన కామెడీ టైమింగ్‌తో వాటిని కవర్ చేసేస్తాడు. అతని వన్‌లైనర్ పంచ్‌లు, హాస్యభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా మనోబాల భాగం మరింత వినోదాన్ని కలిగిస్తుంది.
దర్శకుడు సుందర్ సి హాస్యం, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి సినిమాను రూపొందించారు. అయితే, హీరోయిన్ల పాత్రలను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించినట్టు అనిపిస్తుంది. కథలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ కమర్షియల్ ఫార్ములాను అనుసరించినట్లు కనిపిస్తాయి. ఒక కామెడీ సీన్, ఒక యాక్షన్ సీన్, హీరోకి ఓ ఎలివేషన్ సీన్, విలన్ పాత్రకు ఓ పవర్‌ఫుల్ సీన్— ఇలా లెక్క వేసుకుని తెరకెక్కించినట్టు ఉంటుంది.
టెక్నికల్ అంశాలు
తెలుగు డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే, ప్రేక్షకులతో మరింత బలమైన అనుభూతిని కలిగించే అవకాశం ఉండేది. కొన్ని పాత్రలకు డబ్బింగ్ సరిగ్గా అనిపించకపోవడం కొంతవరకు అసౌకర్యాన్ని కలిగించొచ్చు. మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించదు. పాటలు, లిరిక్స్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. కానీ డైలాగ్స్, కామెడీ పంచ్‌లు మాత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి.
నటీనటుల పర్ఫామెన్స్
విశాల్ తన మార్క్ యాక్షన్, మాస్ అప్పీల్‌తో ఆకట్టుకున్నాడు. అందరికన్నా ముఖ్యంగా.. సంతానం ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని కామెడీ సినిమా మొత్తానికి హైలైట్‌గా ఉంటుంది. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైపోయినట్టు అనిపిస్తుంది. మసోనూ సూద్ విలన్‌గా పరవాలేదు అనిపించుకోగా.. మనోబాల కామెడీ భాగం ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.
తీర్పు
మద గద రాజ పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఇది బాగా రుచించకపోవచ్చు. కానీ, రెండు గంటలు హాస్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఒక్కసారి చూడదగ్గ చిత్రం!
రేటింగ్: 2.5/5
Also Read: Gold Rate Today: భగ్గుమన్న బంగారం.. ఏకంగా తులంపై రూ. 4,360 పెరుగుదల.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: Bank Jobs 2025: బ్యాంక్ ఆప్ మహారాష్ట్రలో ఉన్నత ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి