Kubera: మళ్లీ వాయిదా పడ్డ కుబేర మూవీ.. ఈసారి ఏమైందంటే?

Kubera Release Date: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం.. కుబేర. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాకి ఎప్పటికప్పుడు కొన్ని అడ్డంకుల వల్ల.. సరైన విడుదల తేదీ ఖరారు కావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం.. ఇప్పుడు మళ్లీ మరొకసారి వాయిదా పడినట్లు సమాచారం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 4, 2025, 07:48 PM IST
Kubera: మళ్లీ వాయిదా పడ్డ కుబేర మూవీ.. ఈసారి ఏమైందంటే?

Kubera Update:  తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించే డైరెక్టర్ లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు.  ప్రస్తుతం ఈ డైరెక్టర్.. హీరో నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో కుబేర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక కూడా నటిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా పీరియాడిక్ చిత్రంగా..తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పలు రకాల పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో ధనుష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. 

ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడిగా నటిస్తే.. నాగార్జున  ఒక రిచ్ మెన్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఇకపోతే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సినిమాలలో కథలకంటే..ఎక్కువగా క్యారెక్టర్లకే మంచి ప్రాధాన్యత ఇస్తారని,  గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అందుకే డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు ఆడియన్స్ కి.. బాగా కనెక్ట్ అవుతాయని చెప్పవచ్చు. 

ఇదిలా ఉండగా మరొకవైపు తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమా ..వాస్తవానికి 2024 డిసెంబర్లోనే  రిలీజ్ కావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఈ ఏడాదికి వాయిదా వేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కుబేర సినిమా.. రాబోతున్నట్లు సమాచారం. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొంత భాగం మిగిలి ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. 

ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా పైన మరింత శ్రద్ధ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కుబేర సినిమా.. ఎప్పుడొస్తుందనే విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News