AP Assembly Sessions: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, 28న బడ్జెట్ కఠిన ఆంక్షలు ఇలా

AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఈ నెలాఖరున ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 07:18 PM IST
AP Assembly Sessions: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, 28న బడ్జెట్ కఠిన ఆంక్షలు ఇలా

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు అంటే ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతున్నాయి. రేపు జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి, ఎజెండా ఏంటనేది చర్చించనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు పురస్కరించుకుని కఠిన ఆంక్షలు జారీ అయ్యాయి. 

రేపు ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తరువాత జరిగే కీలకమైన బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎజెండాలో అంశాలు, ఏ అంశంపై ఎప్పుడు చర్చ అనేది నిర్ణయమౌతుంది. మూడు వారాల పాటు సభ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈసారి సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దాంతో అసెంబ్లీలో కఠిన ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు, సందర్శకులు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ అయ్యాయి. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు విభాగాలకు వెళ్లేలా వేర్వేరు రంగులతో పాస్‌లు జారీ చేశారు. ఎవరికి కేటాయించి గేట్ నుంచి వాళ్లే వెళ్లాల్సి ఉంటుంది. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రం అనుమతిస్తారు. ఎవరు ఏ గేట్ నుంచి వెళ్లాలో చూద్దాం.

గేట్ నెంబర్ 1   మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం
గేట్ నెంబర్ 2   ఏపీ కేబినెట్ మంత్రులు
గేట్ నెంబర్ 4    ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఇక అసెంబ్లీలో ఘర్షణ లేదా గొడవలు, నిరసనలకు అవకాశం లేకుండా లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ వంటివాటితో ప్రవేశించడానికి వీల్లేదు.అసెంబ్లీలో మీడియా పాయింట్ తప్ప మరెక్కడా మీడియా సమావేశం నిర్వహించకూడదు. నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులకు అనుమతి లేదు. 

28న ఏపీ బడ్జెట్

ఏపీ బడ్జెట్‌ను ఈ నెల 28వ తేదీన అసెంబ్లీలో సమర్పించనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్‌లో కేబినెట్ భేటీ జరగనుంది పలు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. 

Also read: Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News