Game Changer Day 4 Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 10న విడుదలై మొదటి రోజే రూ. 51 కోట్లు వసూలు చేసింది. అయితే ఆ తర్వాతి రోజుల నుంచి కలెక్షన్లు కాస్త తగ్గిపోయాయి.
ఈ సినిమాకు ఉన్న భారీ అంచనాలు, పండగ సీజన్‌లో విడుదల అయినా కూడా, ప్రేక్షకులను థియేటర్లకు పెద్దగా రప్పించలేకపోయింది.
బాక్సాఫీస్ కలెక్షన్లు:
డే 1: జనవరి 10న రూ. 51 కోట్లు వసూలు చేసింది.
డే 2: రెండో రోజు (జనవరి 11) కలెక్షన్లు రూ. 21.6 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 57.65% తగ్గుదల కనిపించింది.
డే 3: మూడో రోజు (జనవరి 12) రూ. 15.9 కోట్లు మాత్రమే వసూలైంది.
డే 4: నాలుగవ రోజు (జనవరి 13) ఎస్టిమేట్స్ ప్రకారం రూ. 8.5 కోట్లు వచ్చింది.
ఇప్పటి వరకు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 97 కోట్లు దాటింది. కానీ మొదటి రోజు తరువాత కలెక్షన్లు పెద్దగా పుంజుకోవడం లేదు.
అమెరికాలో మాత్రం ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. $1.8 మిలియన్ డాలర్లను వసూలు చేసి, అంతర్జాతీయ విడుదలలలో 99వ స్థానంలో నిలిచింది. అయితే, ఇండియా బాక్సాఫీస్‌లో మాత్రం కఠిన పోటీ ఎదురైంది. బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్', వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు కూడా థియేటర్లలో పోటీపడుతున్నాయి. అంతేకాకుండా, 'పుష్ప 2: ది రూల్' కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
మరోవైపు సినిమా విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో లీక్ కావడం పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 45 మంది పై కేసులు నమోదు చేశారు.
'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ డబుల్ రోల్‌లో కనిపించారు. కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల హవా కొనసాగించలేక పోతోంది. చూస్తూ ఉంటే మరి కొద్ది రోజుల్లోనే సినిమా థియేటర్ల నుండి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. పండగ విన్నర్ అవుతుంది అనుకున్న ఈ సినిమా పండగ డిజాస్టర్ గా నిలిచింది.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.