Krishnaveni died: తెలుగు తెరకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత కమ్ నటి కృష్ణవేణి వృద్దాప్య సమస్యల కారణంగా కన్నుమూసారు. కేవలం నిర్మాతగానే కాదు.. నటిగా.. స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి కన్నమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో శకం ముగిసింది. ఆదివారం ఉదయం తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి 24 డిసెంబర్ 1924 న కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మ. చిన్నప్పటి నుంచి కళల పట్ల ఆసక్తి ఆమె అడుగులు చిత్ర పరిశ్రమవైపు పడ్డాయి. అంతేకాదు ఈమె నటిగానే కాదు.. మంచి నృత్య కారిణి కూడా. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో అతికొద్ది బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో ఆమె ఒకరు. అప్పట్లో కృష్ణవేణి పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. అప్పట్లో ఆమె యాక్టింగ్ కు ముగ్డుడై దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా 1936లో ‘సతీ అనసూయ’ అనే సినిమాతో పరిచయం చేశారు.
బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటించి మెప్పించారు. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ ఉన్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయం అయ్యింది. అది పెళ్లికి దారితీసింది. 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
వీరికి మేక రాజ్యలక్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణవేణి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయమే తమ మాతృమూర్తి తుది స్వాస విడిచినట్లు శ్రీమతి అనురాధ తెలిపారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. ఇటీవలే ఎన్.టి.ఆర్. వజ్రోత్సవం సందర్భంగా గతేడాది డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు.
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటజీవితానికి మొదటి ఛాన్స్ ఇచ్చిన శ్రీమతి కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరమన్నారు పద్మభూషణ్ బాలకృష్ణ. ఆమె మరణం తమ కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆమె చలువే అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కృష్ణవేణి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.