ED Attaches S Shankar Assets: దేశ సినీ చరిత్రలోనే తొలిసారి ఓ సినీ ప్రముఖుడి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఓ సినిమా కథను కాపీ కొట్టాడని నిర్ధారించిన ఈడీ అతడికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. ఆయనెవరో కాదు గేమ్ ఛేంజర్ దర్శకుడు ఎస్ శంకర్. సంచలన విజయం నమోదు చేసుకున్న రోబో సినిమా (తమిళంలో ఎంథిరన్) కథను కాపీ చేశాడని ఒకరు ఫిర్యాదు చేయగా.. దానిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ వాస్తవమేనని తేల్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కథను కాపీ కొట్టిన ఎస్ శంకర్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం తమిళ సినీ పరిశ్రమనే కాదు దేశ సినీ పరిశ్రమ విస్మయం వ్యక్తం చేసింది.
Also Read: Vishwak Sen: 'లైలా' సినిమాలో బూతులపై క్షమాపణ.. విశ్వక్ సేన్ సంచలన లేఖ
తాను రాసిన కథను దర్శకుడు ఎస్ శంకర్ కాపీ కొట్టి రోబో (ఎంథిరన్) సినిమా తీశారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ కేసు వేశారు. ఈ కేసుపై సుదీర్ఘ కాలంగా విచారణ సాగుతోంది. ఆరూర్ తమిళనాదన్ రచించిన జిగూబ కథ నుంచి రోబో కథను తీసుకున్నారని రచయిత బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఆ కేసు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ రోబో సినిమా కథను కాపీ కొట్టారని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
Also Read: Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
ఆరూర్ రాసిన కథకు.. సినిమా రోబో కథకు పోలికలు ఉన్నాయని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించారని ఈడీ పేర్కొంటోంది. 2010లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రోబో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీగా కలెక్షన్లతోపాటు అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.290 కోట్లు వచ్చాయని ఈడీ చెబుతోంది. ఈ సినిమా తీసేందుకు ఎస్ శంకర్ రూ.11.5 కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది.
శంకర్ న్యాయ పోరాటం?
ఈ క్రమంలోనే కథను కాపీ కొట్టిన శంకర్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఆస్తుల స్వాధీనంపై ఎస్ శంకర్ న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఈ కథ తాను కాపీ చేయలేదని శంకర్ బలంగా వాదిస్తున్నారు. కానీ ఈడీ దర్యాప్తు చేస్తూ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో అతడికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి