Supreme Court: అధికారంలో రాక ముందు నుంచే వైసీపీ అధినేత జగన్‌ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసి అభాసుపాలపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఆయన వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో విధిలేక పిటీషన్ ఉపసంహరించుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు గ్రేట్ రిలీఫ్ లభించింది. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్ బెయిల్ రద్దుతో పాటు కేసును ధర్మాసనం మార్పు కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై విచారించిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన కారణాలు కన్పించడం లేనందున రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా సీబీఐ కేసుల్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమని వ్యాఖ్యానించింది. కేసుల్ని మిమ్మల్ని పర్యవేక్షించమంటారా అంటూ పిటీషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. పిటీషన్ డిస్మిస్ చేస్తామని కూడా హెచ్చరించడంతో విధి లేక పిటీషన్ వెనక్కి తీసుకుంటున్నామని రఘురామకృష్ణం రాజు తరపు న్యాయవాది తెలిపారు.
ఇదే పిటీషన్లను గతంలో సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారించగా ఈసారి జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందుకు వచ్చింది. జగన్ తరపున ఈ కేసును ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
Also read: 8th Pay Commission DA Updates: డీఏపై వేతన సంఘం ప్రభావం, భారీగా పెరగనున్న కనీన వేతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి