Dharmana Brothers: అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తిరుగులేదు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలవడంతో వైఎస్ జగన్ ఈ జిల్లా నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ధర్మన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణాదాస్‌కు మంత్రులుగా అవకాశం ఇచ్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్. మరోవైపు సీదిరి అప్పలరాజుకు కూడా మంత్రిగా చాన్స్ ఇచ్చారు. మాజీమంత్రి జిల్లా సీనియర్ నేత తమ్మినేని సీతారామ్‌కు స్పీకర్‌గా అవకాశం కల్పించారు. మిగతా నేతలకు కూడా పదవులు దక్కాయి. అప్పట్లో అధికారాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన నేతలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో జనాలకు ముఖం చూపించడమే మానేశారని టాక్ వినిపిస్తోంది.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
ధర్మాన సోదరులు
ఇక ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో సూపర్ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. నాలుగు దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీలో జిల్లా పాలిటిక్స్‌లో పెద్ద దిక్కు ఆయన.. అయితే ఇవన్నీ గతం.. ప్రస్తుతం ఆయన మౌనం దాల్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు.. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఎనిమిది నెలలు గడిచినా ఆయన మౌనవ్రతం వీడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక అనుచరులు, కార్యకర్తలు తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకు ధర్మాన సైలెంట్ ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. మనోహర్ నాయుడిని జనసేన పార్టీలోకి పంపేందుకు ధర్మాన మౌనంగా ఉంటున్నారని టాక్. మనో హర్ నాయుడు త్వరలోనే జనసేన పార్టీలోనూ చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: YS Jagan: వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు భారీ షాక్.. ఆ కార్యక్రమం రద్దు'
జగన్ పిలుపునకు స్పందన కరువు
మరో లీడర్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణాదాస్ జిల్లాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పార్టీ అధినేత జగన్ పిలుపునివ్వడంతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఇతర నేతలను ఈయన కలుపుకుపోవడం లేదని సమాచారం. మరో సీనియర్ లీడర్.. మాజీ సభాపతి తమ్మినేని సీతారామ్‌కు ఇటీవల వైఎస్ జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆముదాలవలస నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం..! కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందట. తన సొంత నియోజకవర్గం ఆముదాలవలస బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి మరో యువనేతకు అప్పగించడంతో నారాజ్ అయ్యారని సమాచారం. ఇటీవల తమ్మినేని సీతారామ్‌ను ఆముదాల వలస బాధ్యతల నుంచి తప్పించని వైఎస్ జగన్.. అక్కడి బాధ్యతలు చింతాడ రవికుమార్‌కు అప్పగించారు. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
నలుగురు లీడర్లు సైలెంట్‌మోడ్
మొత్తంగా సీదిరి అప్పలరాజుది మరో కథ అన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలో కూటమి నేతలు సీదిరిని చుక్కలు చూపిస్తున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న నలుగురు లీడర్లు ప్రస్తుతం సైలెంట్‌మోడ్‌ను కంటిన్యూ చేస్తుండటంతో.. పార్టీని ముందుండి నడిపే కథనాయకుడు ఎవరని క్యాడర్ ప్రశ్నిస్తోందట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారట. మొత్తంమీద ఇప్పటికైనా వైసీపీ అధినేత స్పందించి నలుగురు లీడర్లు యాక్టివ్ అయ్యేలా పురామయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.