AP Assembly Budget Session: తనకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తేనే శాసన సభకు వస్తానని చెప్పిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో తమిళనాడు తరహా రాజకీయ వాతావరణం నెలకొంది. అక్కడ డీఎంకే అధికారంలో వస్తే.. జయలలిత అసెంబ్లీ ముఖంగా కూడా చూసేది కాదు. అటు ఏఐఏడీఎంకే అధికారంలో ఉంటే కరుణానిధిది కూడా సేమ్ సిట్యువేషన్. ఆయన కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చేవారు కాదు. ఇపుడు అదే పరిస్థితి ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటోంది.
గత అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు నాయుడు తన భార్యను అప్పటి ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రతిక్షం అవమానించిన నేపథ్యంలో నేను అసెంబ్లీలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేయడమే కాదు.. సీఎంగా శాసనసభలోకి అడుగుపెట్టారు. మొత్తంగా గత ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా అధికారంలో వచ్చారు. జగన్ కు ప్రతిపక్ష స్థానం లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో జగన్ కు శాసన సభ నియమాల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే తనకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే వస్తానన్న జగన్ ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం అసెంబ్లీకి వస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అయితే ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ సహా వైఎస్సార్‌సీపీ సభ్యులు హాజరుకాబోతున్నారు. కాగా తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఇక ఈ నెల 28న ప్రభుత్వం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పీఏసీ భేటిలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇపుడు ప్రభుత్వం పక్షానా.. బీజేపీ, జనసేన, టీడీపీ ఓ కూటమిగా ఉన్నాయి. ప్రతిపక్షంలో కేవలం వైయస్ఆర్సీ సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.